అలర్ట్‌ : మీ చేతి వేళ్లను ఒకసారి చూసుకుని మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా తెలుసుకోండి

ఈమద్య కాలంలో గుండెకు సంబంధించిన జబ్బులతో అన్ని రకాల వయసుల వారు హాస్పిటల్స్‌ చుట్టు తిరగడం మనం చాలా కామన్‌గా చూస్తూనే ఉన్నాం.

మనం తినే తిండి మరియు మన జీవన విధానం ఇంకా చుట్టు ఉన్న వాతావరణం కారణంగా ఈమద్య కాలంలో ఎక్కువ శాతం గుండె జబ్బులకు లేదంటే గుండే పోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైధ్యులు అంటున్నారు.

గుండె జబ్బు వచ్చింది అంటే అది ప్రాణాంతకం అవుతుంది.ఇక గుండె పోటు వచ్చింది అంటే కాస్త అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోవాల్సిందే.

ఇలాంటి ప్రమాదకర గుండె జబ్బు మరియు గుండెపోటుకు సంబంధించిన విషయాలను ముందే పసిగట్టే విధానంను ప్రముఖ యూనివర్శిటీ ఆఫ్‌ లివర్‌పూల్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీరు అనేక రకాల ప్రయోగాలు చేసి గుండె జబ్బులు ముందస్తుగా నిర్ధారించడం ఎలా అనే విషయాలను కొన్నింటిని కనిపెట్టారు.

తాజాగా వీరు గుండె జబ్బులు ఇంకా గుండె పోటుతో మరణించిన దాదాపు 200 మందిని పరిశీలించి పరిశోదించారు.వారందరిలో ఎక్కువ శాతం ఒక కామన్‌ విషయం ఉండటం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యంను కలిగించింది.

Advertisement

గుండె జబ్బు కలిగి ఉన్న వారి చేతి వేళ్ల విషయంలో సిమిలారిటీ ఎక్కువగా ఉంది.

  చేతికి ఉన్న వేళ్ల ఆధారంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిర్ధారించవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.సాదారణంగా అయితే చేతికి ఉన్న అన్ని వేళ్లలో మద్య వేళ్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది.ఆ తర్వాత ఉంగరపు వేలు పెద్దగా ఉండి, ఆ తర్వాత స్థానంలో అంటే మూడవ అతి పెద్ద వేళుగా చూపుడు వేలు ఉంటుంది.

కాని కొందరిలో ఈ మూడు వేళ్లు సమానంగా ఉండటం లేదంటే ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉండటం జరుగుతుంది.ఇలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా 80 నుండి 90 శాతం వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.35 నుండి 80 ఏళ్ల లోపు వారిలో ఎక్కువగా ఈ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.దీన్ని లోపం అని ఎందుకు అన్నాం అంటే తల్లి గర్బంలో ఉన్న సమయంలో అన్ని అవయవాలు సరిగా పెరిగితేనే గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య ఉండకుండా ఉంటుంది.

కాని ఒకవేళ ఏదైనా అవయవం సరిగా లేకున్నా కూడా గుండె జబ్బులు వంటి ప్రమాధకర సమస్యలు మొదలు అవుతాయి.అలాగే ఈ వేళ్ల విషయంలో కూడా సరిగా పెరగకుంటే గుండెకు ప్రమాదం అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్నారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

అందుకే గర్బిణి స్త్రీలకు వైధ్యులు పిండం పెరుగుదలకు సంబంధించిన సరైన మెడిసిన్స్‌ ఇస్తూ ఉంటారు.

Advertisement

  ఈ వేళ్ల థీయరీ అనేది కొంత మందికి మాత్రమే అని, వేళ్లు సరిగా ఉన్నంత మాత్రాన గుండె జబ్బు రాదని నమ్మకం కాదని, ఎక్కువ శాతం అలా వేళ్లు ఉంటే జాగ్రత్త పడాలి అనేది శాస్త్రవేత్తల మాట.ముందస్తు చర్యలు తీసుకుంటూ బాధ పడాల్సిన అక్కర లేదని, కాస్త తిండి విషయంలో, లైఫ్‌ స్టైల్‌ విషయంలో వేళ్లు అలా ఉన్న వారు జాగ్రత్తగా ఉంటే చాలు అంటూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.మరి మీరు ఒకసారి మీ చేతి వేళ్లు చూసుకోండి.

పైన చెప్పిన విధంగా మీ చేతి వేళ్లు ఉంటే భయపడనక్కర్లేదు.కాని జాగ్రత్తగా అయితే ఉండండి.

తాజా వార్తలు