లుక్ మార్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్మార్ట్ లుక్ లో సూపర్ అనేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భీమ్ పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒమైక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో వాయిదా పడింది.

బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

రిలీజ్ కు కొన్నిరోజుల ముందు ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడుతున్నట్టు చేసిన ప్రకటన అభిమానులకు తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల గత కొన్నేళ్లుగా భీమ్ లుక్ కే పరిమితమైన ఎన్టీఆర్ ప్రస్తుతం లుక్ ను మార్చుకునే పనిలో పడ్డారు.

ఎన్టీఆర్ నయా లుక్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ మరింత యంగ్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు తారక్ ను ప్రశంసిస్తున్నారు.

Advertisement

రౌడీ బాయ్స్ ఆడియో లాంఛ్ ఈవెంట్ లో కొత్త లుక్ లో ఎన్టీఆర్ మెరిశారు.కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ ఈ లుక్ లోనే కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో తారక్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

తారక్ వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూనే ఆ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తారక్ కు జోడీగా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం.అయితే ఏ హీరోయిన్ ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు