Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ పండుగకు షేక్ చేస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర( Devara ) ఈ ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చేశారు.ఈ సినిమా అక్టోబర్ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

 Young Tiger Ntr Devara Movie New Release Date Details Here Goes Viral In Social-TeluguStop.com

దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.దసరా పండుగకు ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి దేవర సినిమాను కచ్చితంగా అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని సమాచారం.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా అన్ని లెక్కలకు అనుగుణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కీలక మార్పులు జరిగాయని సమాచారం అందుతోంది.దేవర సినిమాలో తారక్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు.

హిందీలో ఎక్కువ సినిమాలలో నటించినా సరైన సక్సెస్ దక్కని జాన్వీ కపూర్ ఎన్టీఆర్( Janhvi Kapoor ) సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ ఈ సినిమాలో కనిపించనున్నారు.శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా కథకు సంబంధించి వేర్వేరు గాసిప్స్ వైరల్ అవుతుండగా ఈ సినిమా గురించి ఆ గాసిప్స్ నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్( NTR ) మాత్రం ఈ సినిమా కోసం కసితో పని చేస్తున్నారు.

దేవర సినిమా ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా తారక్ కు నిర్మాతగా కూడా కీలకమనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్న కెరీర్ బెస్ట్ హిట్ ను ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube