ఏపీ ఫలితాల గురించి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ సైతం సంతోషించేలా?

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలు తాజాగా వెలువడిన సంగతి తెలిసిందే.ఏపీలో కూటమి కనీవిని ఎరుగని స్థాయిలో విజయాన్ని సాధించడం గమనార్హం.

 Young Tiger Junior Ntr Tweet About Tdp Alliance Victory Details Here Goes Vir-TeluguStop.com

కూటమి నేతలకు శుభాకాంక్షలు చెబుతూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.అయితే ఏపీ ఫలితాల గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని కామెంట్లు వినిపించినా ఆయన ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు.

ప్రియమైన చంద్రబాబు ( Chandrababu ) మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తారక్ పేర్కొన్నారు.మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నానని కామెంట్లు చేశారు.

అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్( Nara Lokesh ) కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీగా గెలిచిన భరత్ ( Bharath )కు పురంధేశ్వరి అత్తయ్యకు నా శుభాకాంక్షలు అని తారక్ రియాక్ట్ అయ్యారు.

Telugu Andhra Pradesh, Balakrishna, Bharath, Chandrababu, Lokesh, Tdpalliance, Y

అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ( Pawan Kalyan )కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తారక్ చెప్పుకొచ్చారు.తారక్ ట్వీట్ చేయడం లేదని కొంతమంది కామెంట్లు చేయగా ఆ విమర్శలకు చెక్ పెడుతూ తారక్ ట్వీట్ చేయడం గమనార్హం.టీడీపీ ఘన విజయం గురించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో పార్టీ శ్రేణులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Balakrishna, Bharath, Chandrababu, Lokesh, Tdpalliance, Y

రాజకీయ అంశాల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కడా స్పందించని జూనియర్ ఎన్టీఆర్ కూటమికి అనుకూలంగా ట్వీట్ చేయడం అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా వరుస సినిమాలతో తారక్ సత్తా చాటాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube