టమాటా సాస్ నంజుకుని చాక్లెట్ తిన్న యువకుడు.. వీడియో చూస్తే మతిపోతుంది..

చాక్లెట్( Chocolate) అంటే దాదాపు అందరికీ ఇష్టం ఉంటుంది.చాక్లెట్స్‌లో చాలా రకాల ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి.

 Young Man Eats Chocolate After Eating Tomato Sauce-TeluguStop.com

వాటిలో డెయిరీ మిల్క్, కిట్‌క్యాట్, మంచ్, పార్లే, స్నికర్స్ బాగా పాపులర్ అయ్యాయి.వీటిని చూస్తేనే నోరూరుతుంది.

అయితే ఈ రోజుల్లో చాక్లెట్ వేరే ఫుడ్ తో మిక్స్ చేసి తినడం ప్రజలు స్టార్ట్ చేశారు.చాక్లెట్ పానీ పూరి, చాక్లెట్ దోశ, చాక్లెట్ సమోసా వంటి చిత్ర విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి.

తాజాగా చాక్లెట్ ను మరొక ఫుడ్ కాంబినేషన్తో కలిపి తినేసాడు ఒక యువకుడు.ఆ కాంబినేషన్ గురించి కలలో కూడా మనం ఊహించం.

ఈ ఫుడ్ మిక్స్‌కి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది అప్పట్నుంచి అది తెగ వైరల్ అవుతుంది.

సాధారణంగా మనం ఐస్‌క్రీమ్‌లు, కేక్‌లకు చాక్లెట్ సిరప్‌ను జోడిస్తాం కానీ వైరల్ అవుతున్న వ్యక్తి మాత్రం కానీ టొమాటో సాస్‌లో చాక్లెట్ బార్‌ను ముంచి తినేసాడు.సింగపూర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఒక వీడియోలో టమాటా సాస్‌( Tomato sauce ) స్నికర్స్ చాక్లెట్‌పై పోసుకొని తినడం మనం చూడవచ్చు.ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ పేరు కాల్విన్ లీ.లీకి వింత ఫుడ్ కాంబినేషన్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.</br

“కెచప్ స్నికర్స్ ట్రై చేద్దాం” అని లీ తన వీడియోని ప్రారంభించాడు.స్నికర్స్ ప్యాక్ నుంచి ఒక చాక్లెట్ బార్‌ను తీసి, దానిపై కొంత సాస్ పోశాడు.ఆ తర్వాత అతను ఎలాంటి సందేహం లేకుండా చాక్లెట్-సాస్ మిశ్రమాన్ని కొరికాడు.కెమెరా వైపు చూసి చాలా బాగుంది అని చెప్పాడు కానీ అతని ముఖం మరోలా ఉంది.“హ్మ్మ్.ఇది అసహ్యంగా అనిపించదు.కానీ కెచప్ పులుపు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మొత్తం రుచి చాలా టేస్టీగా ఉంది.” అని వీడియో పోస్ట్ లో రాశాడు.కొందరు నెటిజన్లు ఇది బాగుండదని అంటే మరి కొందరు దానిని మేం కూడా ట్రై చేస్తామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube