యువతికి సుడిగాలి సుధీర్ పిచ్చి.. అతని పేరును టాటూగా వేయించుకొని.. రచ్చరచ్చ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సుడిగాలి సుధీర్ ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.

అబ్బాయిలతో పాటుగా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.అలాగే సుధీర్ కు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

అయితే సుధీర్ అంటే చాలామందికి పిచ్చి అభిమానం.అయితే ఆ పిచ్చి అభిమానం ఎంత పీక్స్ కి చేరిందంటే ఏకంగా సుధీర్ పేరుని పచ్చ బొట్టు పొడిపించుకునేంతగా.

ప్రీతి అనే ఓ యువతి సుధీర్‌ని ప్రేమించేస్తుందట.అయితే ఆ యువతి ఆ ప్రేమను ఎలా వ్యక్త పరచాలో తెలియక.

Advertisement

సుధీర్ పేరుని తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించేసుకుందట.అంతేకాదు కాలేజ్‌కి వెళ్లినా.

ఇంట్లో ఉన్నా,పడుకున్నా,కూర్చున్నా,తింటున్నా నడుస్తూ.ఏం చేస్తున్నా కూడా సుధీర్ ధ్యాసలోనే ఉంటుందట.

అయితే ఆమెకు ఈ జబ్బు బాగా ముదిరిపోవడంతో.డాక్టర్ గారూ మీరే దిక్కు అంటూ ఇలాంటి కేసులకు పాపులర్ డాక్టర్ అయిన డా.

కళ్యాణ్ చక్రవర్తికి ఫోన్ చేసి తన సమస్యను చెప్పుకుంది ప్రీతి.డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ప్రీతి అనే యువతి ఫోన్ చేసి సుడిగాలి సుధీర్‌తో ప్రేమ మైకం గురించి చెప్పగా ఆ మాటలు విన్న డాక్టర్ అవాక్కయ్యారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కేవలం జబర్దస్త్ చూసేటప్పుడేనా లేదంటే మిగతా టైం అప్పుడు చదువుకున్నప్పుడు, ఆట పాట చేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నావా? అని ఆ యువతిని అడిగగా దానికి ఆ యువతి.అవును సార్ నాకు ఎప్పుడూ సుధీర్ ఆలోచనలే.

Advertisement

కాలేజ్‌కి వెళ్లినా సరే ఎప్పుడెప్పుడు వెళ్లి సుధీర్‌ని చూద్దామా? అని అనిపిస్తుంది అని సమాధానం చెప్పడంతో దెబ్బకి తల పట్టుకున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి.అయితే నీకు సుధీర్ అంటే ఇష్టమా లేదంటే ప్రేమా? అని ఆ యువతిని అడగ్గా.ప్రేమే అనుకోండి.

సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం.

ప్రేమ అన్నీ అందుకే అతని టాటూని కూడా వేయించుకున్నా అంటూ ఆన్సర్ ఇచ్చింది యువతి.ఇష్టం, అభిమానం, ప్రేమ.వీటన్నింటికి మధ్య సన్నని గీత ఉంటుంది.

నీకు వచ్చిన సమస్య ఏంటంటే.దీన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నావ్.

మీ నాన్న గారు పట్టించుకోరని అంటున్నావ్.అసలు నువ్ ఎప్పుడూ చూడని.

మాట్లాడని వ్యక్తిని ప్రేమిస్తున్నానని అంటున్నావ్ అంటే.నీకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదని అర్ధం అవుతుంది.

ముందు నీపట్ల మీపేరెంట్స్‌కి ప్రేమ లేదని నాకు అనిపిస్తుంది.అయితే మీ తల్లితండ్రి కేవలం కండిషన్స్‌తో మాత్రమే పెంచారు తప్పితే.

నిజమైన ప్రేమను చూపించలేదు.అందుకే టీవీలో కనిపించే క్యారెక్టర్‌ని ప్రేమించేస్తున్నా అంటున్నావ్.

దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.హద్దు మీరి.

ప్రేమ పేరుతో నువ్ సుధీర్ పేరుని శరీరంపై వేసుకున్నావ్ అని అంటున్నావ్.కేవలం నువ్వేనా మీ ఫ్రెండ్స్ కూడా సుధీర్ పచ్చబొట్టు పొడిపించుకున్నారా? అని అడిగారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి.లేదు సార్ మా ఫ్రెండ్స్ అంతా వాళ్ల పేర్లు వాళ్ల ఇష్టమైన పేర్లను రాయించుకున్నారు.

నేను మాత్రం సుధీర్ పేరు వేయించుకున్నా అని అన్నది.ఆ దెబ్బతో అయ్యో రామా అని తలపట్టుకున్న డాక్టర్.

.ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటావ్ కదా అప్పుడు నీ భర్త ఇతను ఎవరు అంటే ఏం చెప్తావ్,సుధీర్ పేరు రాయించుకున్నా అని అంటే కుదురుతుందా? సుధీర్‌ని లక్షల్లో అమ్మాయిలు ఇష్టపడతారు.నువ్ ఇప్పుడు ముందు చదువుపై శ్రద్ధపెట్టు.

కనీసం ఇప్పటికైనా రియలైజ్ అవ్వు.క్లాస్ పీకారు డాక్టర్.

తాజా వార్తలు