జీవన్ రెడ్డి తో సినిమా కి సై అంటున్న యంగ్ హీరో...

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది కి ఒక సినిమా ప్లాప్ అయితే మళ్ళీ ఇంకో సినిమా అవకాశం అనేది రాదు.

నిజానికి సినిమా ల్లో చాలా మంది డైరెక్టర్లు వాళ్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు.

అయితే కొంత మంది డైరెక్టర్లు ఇలాంటి ప్రాసెస్ లో ఉన్నప్పుడే కొన్ని కొత్త సినిమాలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటప్పుడు కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కొన్ని ప్లాప్ అవుతాయి అలాగని దాన్ని మనం ఆ డైరెక్టర్ ఫెయిల్యూర్ గా చూడకూడదు.అయితే అలాంటి వాళ్లలో జీవన్ రెడ్డి ( Jeevan Reddy )ఒకరు ఈయన గతం లో దళం లాంటి ఒక సినిమా తీశాడు ఈ సినిమా లో మంచి మెసేజ్ ఉంటుంది అయిన కూడా ఈ సినిమా అంతా గా సక్సెస్ కాలేదు ఇక దాంతో ఆయన తీసిన జార్జ్ రెడ్డి సినిమా( George Reddy movie ) కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అయిన కూడా ఆయనకి టాలెంట్ లేదు అని కాదు నిజానికి ఆయన ఒక మంచి డైరెక్టర్ అయిన కూడా ఆయనకి సక్సెస్ అనేది రావడం లేదు.

అయితే ఇప్పుడు ఆయన ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలని చూస్తున్నాడట ఇక అందులో భాగం గానే ఆయన రీసెంట్ గా హీరో శర్వానంద్( Hero Sharwanand ) కి ఒక కథ కూడా చెప్పాడట అది శర్వా కి కూడా బాగా నచ్చిందట మరి ఈ సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ సినిమా మాత్రం పక్క గా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.ఇప్పటికే శర్వా కూడా ఓకే ఒక జీవితం సినిమాతో మంచి సక్సెస్ సాధించి ఉన్నాడు కాబట్టి ఆయన కి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళతో సినిమా చేయడం.కూడా ఒక మంచి మూవ్మెంట్ అనే చెప్పాలి.

నిజానికి జీవన్ రెడ్డి ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు గడిచిన కూడా ఇంతవరకు ఆయనకి ఒకటి కూడా కమర్షియల్ సక్సెస్ దక్కడం లేదు ఇక ఇప్పుడు శర్వా తో చేసే ప్రాజక్ట్ తో కమర్షియల్ హిట్ కొట్టడం పక్క అని తెలుస్తుంది ఆయన కి ఒక్క హిట్ కనక పడితే ఆయన కెరియర్ ఇండస్ట్రీ లో చాలా వరకు మారిపోతుంది అని చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

తాజా వార్తలు