19 ఇయర్స్ స్పెషల్‌... నితిన్ కు మాత్రమే ఇది సాధ్యం అయ్యింది

యంగ్‌ హీరోలు ఈమద్య కాలంలో పాతిక సినిమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం.ఒకప్పుడు టాలీవుడ్‌ లో హీరోలు చాలా సినిమాలు చేసేవారు.

ఏడాదికి అయిదు ఆరు నుండి డజను సినిమాల వరకు చేయడం జరిగేది.కాని ఫిల్మ్ మేకింగ్‌ విషయంలో వచ్చిన మార్పులు చేర్పుల కారణంగా సినిమాల సంఖ్య చాలా తగ్గింది.

ఒక్కో హీరో ఏడాది రెండు మూడు సినిమాలు చేయడం చాలా గగనంగా మారింది.ఒకటి రెండు సినిమాలే చేస్తున్నారు.

నాని యంగ్‌ హీరో నితిన్ మాత్రం తన 19 ఏళ్ల సినీ కెరీర్ లో 30 సినిమా లు చేశాడు.అంటే ఏడాదికి కనీసం ఒకటికి తగ్గకుండా కొన్ని ఏళ్లు రెండు సినిమా లు మూడు సినిమాలు కూడా చేసిన ఘనత దక్కించుకున్నాడు.

Advertisement

అంతటి ఘనత దక్కించుకున్న నితిన్‌ మరో అరుదైన ఘనత దక్కించుకుని టాలీవుడ్‌ లో మరే హీరోకు సాధ్యం కాదు అది నా సొంతం అన్నట్లుగా ఉన్నాడు.అయితే అదో చెత్త రికార్డు అవ్వడం ఇక్కడ ఆసక్తికర విషయం.

నితిన్‌ హీరోగా ఇప్పటి వరకు 30 సినిమా లు అయ్యాయి.ఆ ముప్పై సినిమా ల్లో నితిన్‌ కు సక్సెస్ లు తెచ్చి పెట్టిన సినిమా లు పది లోపే.అంటే ఆయన సక్సెస్‌ రేటు మరీ దారణంగా ఉంది.

అయినా కూడా ఆయన కు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.ఆయన కాకుండా మరే హీరో అయినా ఇలా వరుసగా ప్లాప్‌ లను చవి చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా ల్లో నుండి కనిపించకుండా పోయే వాడు.

కాని నితిన్ లక్‌ మరియు పట్టుదల కారణంగా ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.నితిన్ కు ఉన్న పట్టుదల వల్లే ఈ నాడు ఈ స్థాయిలో ఉన్నాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వరుసగా పది సినిమాలు నిరాశ పర్చినా కూడా కెరీర్‌ లో ఏదో నమ్మకంతో కంటిన్యూ అవుతూ మంచి విజయాలను ఆ తర్వాత దక్కించుకున్నాడు.మళ్లీ మళ్లీ ప్లాప్‌ వచ్చినా సక్సెస్ లు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకంతో నితిన్ కెరీర్ కొనసాగించాడు.

Advertisement

కొత్తగా వచ్చే వారు నితిన్ ను అనుసరించాల్సిందిగా సూచిస్తున్నారు.

తాజా వార్తలు