ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో కొంతమంది డైరెక్టర్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది అలాంటి వాళ్లలో వినాయక్ ( V V Vinayak )ఒకరు ఈయన తీసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కొట్టాయి.మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )దగ్గరి నుండి జూనియర్ ఎన్టీయార్ వరకు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్లు అందుకున్నారు.నిజానికి ఈయన ఖైదీ నెంబర్ 150 సినిమా( Khaidi No.150 ) చేశాక సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటెలిజెంట్ అనే సినిమా ఒక పెద్ద డిజాస్టర్ గా మారింది

ఇక దాంతో ఆయన చాలా రోజుల నుంచి గ్యాప్ తీసుకొని హిందీ లో బెల్లంకొండ శ్రీనివాస్ ని పెట్టుకొని ఛత్రపతి సినిమా( Chatrapathi ) ని తీశారు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.ఇక దాంతో ప్రస్తుతం ఈయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీ లో విపరీతంగా వినిపిస్తుంది ఇక ఇప్పుడు అయితే వినాయక్ కి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే అందరూ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ పాన్ ఇండియా డైరెక్టర్లను తీసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో ఒక సినిమా తీసి మంచి విజయం సాధిస్తే మళ్ళీ వినాయక్ కి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వవచ్చు…అయితే అందులో భాగంగానే ఇప్పుడు ఈయన శర్వానంద్( Sharwanand ) తో ఒక సినిమా చేస్తున్నాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీ లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది నిజానికి వీళ్ళ కాంబో లో ఒక సినిమా వస్తె అది చూడటానికి చాలా మంది అభిమానులు కూడా చాలా వరకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు… అయితే వీళ్లిద్దరి కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉంటుంది అనేది చాలా వరకు అసక్తికరంగా మారింది….