ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ పేరుతో చేసేటటువంటి చేష్టల కారణంగా ఇతరులు ప్రాణాలను కోల్పోతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు తన ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకోలేకపోవడంతో ఆమెతో దిగిన ఫోటోలను బహిర్గతం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి “టెక్కలి” ప్రాంతంలో సంధ్య (పేరు మార్చాం) అనే ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే ఇటీవలే సంధ్య స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది.
దీంతో పెళ్లి కాకుండానే హద్దులు దాటేశారు.అలాగే వ్యక్తిగతంగా ఫోటోలు కూడా దిగేవారు.
దీంతో ఈ విషయం గురించి సంధ్య ఇంట్లో తెలియడంతో ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో సంధ్య తన ప్రియుడిని పెళ్లి చేసుకోమని అడిగినప్పటికీ ప్రియుడు మాత్రం ఇతర కారణాలను తెలియజేస్తూ మొహం చాటేస్తున్నాడు.
దీంతో సంధ్య మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది.దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సంధ్య ప్రియుడు తామిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తీసినటువంటి ఫోటోలను వరుడికి పంపించాడు.
ఈ విషయం తెలుసుకున్న సంధ్య తీవ్ర మనస్తాపానికి గురైంది.అంతేకాకుండా తన కుటుంబం పరువు ప్రతిష్టల గురించి ఆలోచించిన సంధ్య విచక్షణ కోల్పోయి ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఈ విషయం స్థానికుల నుంచి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పంచనామా నిమిత్తమై ఆస్పత్రికి తరలించారు.అనంతరం బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని సంధ్య ప్రియుడిని కఠినంగా శిక్షించాలని కటకటాల్లోకి నెట్టారు.
తొందర్లో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లాల్సిన సంధ్య జీవితం అకారణంగా ముగిసిపోయిందని గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.