మీ ఆధార్‌కు పాన్‌ కార్డు లింక్​ చేశారా.. లేకుంటే ఈ నష్టం భరించవలసిందే.. ?

భారతదేశంలో ఆధార్‌ కార్డ్, పాన్‌ కార్డ్ ఎంత ముఖ్యమైనదో అందరికి తెలిసిందే.

ఇక గత ఏడాది ఫిబ్రవరి 13న ఆధార్‌తో పాన్‌ కార్డ్‌ను అనుసంధానించుకోవాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అయితే మార్చి 31, 2021 వరకు చివరి తేదీగా పేర్కొంది.కాగా ఈ తేదీ లోపులో ఆధార్‌తో పాన్‌ కార్డ్‌ను అనుసంధానించకపోతే మాత్రం ఏప్రిల్‌ 1, 2021 నుంచి పాన్‌ చెల్లకుండా పోతుందని, అంతే కాదు ఆ పాన్‌ ఉన్న వ్యక్తి దగ్గర్నుంచి రూ.10వేల వరకూ జరిమానాను విధించే ఆస్కారం కూడా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.ఒకవేళ ఇలా చేయకుండే ఏం అవుతుందని ఊరుకుంటే జరిగే నష్టం మాత్రం పెద్దగానే ఎదుర్కోవలసి వస్తుందట.

You Will Face Consequences If Your Pan Not Linked With Aadhar , Linked, PAN Car

ఎందుకంటే పాన్‌ కార్డులు చాలా ఆర్థిక లావాదేవీల్లో కీలకం.అదీగాక బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో మదుపు చేయాలన్నా, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు, ఆస్తుల క్రయవిక్రయాలకూ ఇలా అన్నీంటికి అడ్దంకి ఏర్పడే అవకాశం ఉందట.

అయితే జరిమానా చెల్లించి, పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పుడే మళ్లీ వీటిని అనుమతిస్తారట.కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పనిని ప్రారంభించండి.

Advertisement
మజాకా వల్ల సందీప్ కిషన్ కెరియర్ సెట్ అవుతుందా..?

తాజా వార్తలు