Gulzar Sahib Liquor : ఈ బుడ్డోడి కోరిక వింటే అవాక్కవుతారు.. మద్యం కావాలంటూ ఏడుస్తున్నాడు!

చిన్నారులకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.అందులో కొన్ని నవ్వు పుట్టిస్తుంటాయి.

 You Will Be Surprised To Hear The Desire Of This Buddodi He Is Crying For Alcoho-TeluguStop.com

కొన్ని సార్లు చిన్నారులు చేసే పనులు చేసి పెద్దలు ఆశ్చర్యపోతారు.ఇక కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘పెళ్లి కావాలి.నాకూ‘ అంటూ ఓ చిన్న పాప ముద్దు ముద్దుగా అనడం చూశాం.అసలు పెళ్లి గురించి తెలియకపోయినా, తనకు పెళ్లి చేయాలని ఆ పాప అనడం చూసి అంతా ముసిముసిగా నవ్వుకున్నారు.

తాజాగా అదే తరహాలో ఓ బుడ్డోడు ముద్దుముద్దుగా తన తండ్రితో పలికిన మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో కనిపించే ఫన్నీ వీడియోలు చూస్తే మనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుతాం.తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.గుల్జార్ సాహెబ్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది.అందులో నిండా మూడేళ్లు కూడా లేని ఓ బుడ్డోడు తన తండ్రిని ఏదో కావాలని అడుగుతుంటాడు.

తీరా అదేంటో తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు.తనకు మద్యం కావాలని గుక్క పెట్టి ఏడుస్తూ ఆ బాలుడు అడుగుతున్నాడు.

ఏదైనా చాక్లెట్ లేదా చిప్స్ ప్యాకెట్ కావాలన్నట్లు మద్యం అడగడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.దీనిని బాలుడి తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.

ఇది చూసిన నెటిజన్లు ఆ బుడ్డోడి కోరికను విని అవాక్కవుతున్నారు.చిన్నతనంలోనే మద్యం కావాలని బాలుడు అడగడం పలువురు నవ్వుతున్నారు.

అయితే దీనిని పెద్దలు అతడికి అర్థం అయ్యేలా వివరించాలని, ప్రస్తుతానికి వినోదంగా ఉన్న భవిష్యత్తులో అది ఇబ్బందిగా మారుతుందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube