కంచె తో పాపులర్ అయిన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఎంత రెచ్చిపోతున్నా సరే అమ్మడికి అవకాశాలు మాత్రం రావట్లేదు.లాస్ట్ ఇయర్ బాలయ్యతో అఖండ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమా సూపర్ హిట్ అందుకున్నా సరే నెక్స్ట్ ఛాన్స్ రాలేదు.
అయినా సరే అమ్మడు నిరాశచెందకుండా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కాలం వెల్లదీస్తుంది.అయితే లేటెస్ట్ గా ప్రగ్యా తన సోషల్ మీడియాలో అఖండ సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ షేర్ చేసింది.
ఆ మూవీ రిలీజై ఏడాది అవుతుంది.ఈ సందర్భంగా ప్రగ్యా ఆ మూవీలో బాలకృష్ణతో పాటు ఉన్న తన ఫోటో షేర్ చేసింది.
అఖండకు 1 ఇయర్ అవుతున్నా సరే అమ్మడికి మరో ఛాన్స్ మాత్రం రాలేదు.అసలు దర్శక నిర్మాతలు ప్రగ్యాని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.అమ్మడు ఎంత కష్టపడుతున్నా సరే పెద్దగా అవకాశాలు రావట్లేదు.సీనియర్ హీరోలతో చేస్తుంది కదా ఇక యంగ్ హీరోల సినిమా ఛాన్సులు ఇచ్చినా వేస్ట్ అనుకున్నారో ఏమో కానీ కనీసం యువ హీరోలు కూడా ఆమెతో నటించాలని ఆసక్తి చూపించట్లేదు.
ఛాన్స్ ఇస్తే చాలు పెద్దగా రెమ్యునరేషన్ కూడా ఆశించట్లేదు ప్రగ్యా.మరి అమ్మడికి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.







