ఈ రోజుల్లో చాలా మంది యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్ల మీదికి వచ్చేస్తున్నారు.ఇక కొందరు పెద్దలు కూడా లైసెన్స్ లేకుండా తిరగేస్తుంటారు.
అయితే పోలీస్ చెకింగ్ వచ్చినప్పుడు వీరు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు.ఈ సమయంలో పోలీసులు వీరిపై లాఠీలు విసరడం లేదంటే వారి వెంట పడటం చేస్తుంటారు.
అలాంటప్పుడు కొందరు ఆగిపోతే మరికొందరు మాత్రం అలాగే దూసుకెళ్తుంటారు.ఇలా చేయడం చాలా డేంజర్.
కాగా తాజాగా ఇలాంటి ఒక సంఘటన బిహార్‍లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.
ఇటీవల బిహార్, జముయ్ ప్రాంతంలో పోలీసులు వెహికల్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు.వీరు అందరి లైసెన్సులు చెక్ చేస్తూ సరైన పత్రాలు లేని వారికి ఫైన్స్ విధిస్తున్నారు.
ఈ సమయంలోనే అటువైపుగా స్కూటీపై ఇద్దరు యువకులు వచ్చారు.వారు పోలీసులు ఆపమన్నా ఆపకుండా తమ స్కూటర్‌తో అలాగే వెళ్లిపోతున్నారు.
ఇది చూసి ఒక కానిస్టేబుల్ చాలా కోపానికి గురయ్యారు.అనంతరం వారి వెంట పడుతూ వెనుక ఉన్న యువకుడిపై కర్రతో గట్టిగా బాదాడు.
ముందున్న మరో కానిస్టేబుల్ ఇద్దరు యువకులను గట్టిగా తోసారు.అంతే వారు ఒకేసారి స్కూటీపై నుంచి కింద పడ్డారు.
వీరిని తోసిన కానిస్టేబుల్ కూడా కిందపడిపోయారు.వేగంతో వెళ్తున్న వారు కింద పడటంతో చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి.
కింద పడిన వారిని కొట్టేందుకు పోలీసులు మళ్లీ ముందుకు వచ్చారు.కానీ వద్దు సార్ అని వారు విజ్ఞప్తి చేయడంతో ఆగిపోయారు.ఈ సంఘటనకు సంబంధించి అన్ని దృశ్యాలు ఒక వీడియోలో రికార్డు అయ్యాయి.ఇప్పుడా వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.కొందరు పోలీసులను సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ఆ యువకులను చూసి అయ్యో పాపం అంటున్నారు.పోలీసులు అలా చేయడం వల్ల వారు చనిపోయే ప్రమాదం ఉందని.
ఇలా చేయడం ఏం బాగోలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్లమీదకు ఎందుకు వస్తారు? అని కొందరు వారిని తిట్టిపోస్తున్నారు.ఈ వీడియో మీరు కూడా ఓ లుక్కేయండి.