ఈ పెన్ను ధర తెలిస్తే షాక్ అయిపోతారు... రూ.22.74 లక్షలు మరి!

సాధారణంగా మనం వాడే పెన్నల ధరలు మార్కెట్లో రూ.2 నుండి మహా కాకపోతే రూ.50 వరకు ఉంటాయి. అదే ఎవరికన్నా గిఫ్టులు ఇచ్చే పెన్నులైతే వందల్లో, వేలల్లో ఉంటాయి.

 You Will Be Shocked If You Know The Price Of This Pen... Rs. 22.74 Lakhs Price-TeluguStop.com

అంతేగాని లక్షల్లో ధర పలికే పెన్ను గురించి మీరు విన్నారా? విని వుండరు కదా.ఇపుడు ఇక్కడ చెప్పుకోబేయే పెన్ను ధర తెలిస్తే నోరు వెళ్లబెడతారు.అవును, ఈ మధ్య ఏకంగా 22.74 లక్షల రూపాయల పెన్ను మార్కెట్‌లోకి వచ్చి, అందరినీ విస్మయానికి గురి చేసింది.అవును, ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫెరారి, ప్రముఖ పెన్నుల కంపెనీ మాంట్‌బ్లాంక్‌ సంయుక్తంగా దీన్ని తయారు చేయడం విశేషం.

ద మాంట్‌బ్లాంక్‌ ఫెరారీ స్తైలేమా ఎస్పీ3’ పేరిట లిమిటెడ్‌ ఎడిషన్‌గా దీనిని తీసుకొచ్చాయి.డేటోన ఎస్పీ3 కారు స్ఫూర్తితో దీన్ని తయారు చేయడం కొసమెరుపు.అయితే ఇంత ఖరీదైన పెన్నుని దేనితో తయారు చేసారు అనే అనుమానం మీకు కలగక మానదు.

ఇకపోతే ఈ కలం మూతను టైటానియంతో చేస్తే, ములుకును తెల్ల బంగారంతో రూపొందించారు.ఇందులో ఇంకు నింపేందుకూ కూడా ప్రత్యేక ఏర్పాటు ఉంది.రక్షణగా పెన్ను మధ్యలో అమర్చే రెడ్‌బ్లేడ్‌ ఫెరారీ కార్లను ప్రతిబింబిస్తుంది.అందుకే దీనికి అంత ఖరీదు.

కాగా ప్రపంచ వ్యాప్తంగా 599 పెన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.వీటిని montblanc.com వెబ్‌సైట్లో అమ్మకానికి ఉంచారు.కావాలని అనుకున్నవారు సదరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా సదరు పెన్నులను సొంతం చేసుకోవచ్చని సమాచారం.అయినా అంత ఖరీదైన పెన్నులను ఎవరు కొంటారు అని ఆలోచించకండి.

వాటిని కొనడానికి కూడా ఓ వర్గం జనాలు క్యూలు కడతారు.అడ్వాన్సు బుకింగులు కూడా జరగొచ్చు మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube