సాధారణంగా ఖరీదైనవి అంటే మనం బంగారమో, వజ్రాలో, ప్లాటీనమోనని చెబుతాం.అయితే ప్రపంచంలో ఖరీదైన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.
వాటిలో భోజనం చేయాలంటే బిల్లు లక్షల్లో చెల్లించుకోవాల్సిందే.ఈ ఖరీదైన రెస్టారెంట్లు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్.ఇక్కడ భోజనం చేయాలంటే దాదాపు $2380 ఖర్చు అవుతంది.
ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం వేసవిలో మాత్రం ఓపెన్ ఉంటుంది.
పైగా ఈ రెస్టారెంట్‌ను అక్వేరియంలో నిర్మించారు.
దీంతో ఈ హోటల్ ప్రపంచంలోనే చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది.ప్రపంచంలోనే రెండో ఖరీదైన రెస్టారెంట్‌గా ‘పెర్ సే’ నిలిచింది.
ఈ హోటల్‌ను 2014లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించారు.కొన్ని రకాల డిష్‌లకు ఈ రెస్టారెంట్ ప్రసిద్ధిపొందింది.
ఇక్కడ ప్రధానంగా ఫ్రెంచ్, అమెరికన్ వంటకాలను రుచి చూడవచ్చు.ఈ హోటల్‌లో పుడ్ తినాలంటే ఒక వ్యక్తి $680 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
చైనాలో ఉన్న ఈ రెస్టారెంట్ ప్రపంచంలోనే మూడో అత్యంత ఖరీదైన హోటల్‌గా నిలిచింది.ఇక్కడ భోజనం చేయాలంటే ఒక్కో వ్యక్తి దాదాపు $ 570 నుంచి $ 900 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక నాలుగో స్థానంలో మాసా రెస్టారెంట్ నిలిచింది.ఇది న్యూయార్క్ నగరంలో ఉంది.ఇక్కడ భోజనం చేయాలంటే దాదాపు $595 ఖర్చువుతుంది.ప్రపంచంలోనే 5వ అత్యంత ఖరీదైన హోటల్‌గా మైసన్ పిక్ వాలెన్స్ రెస్టారెంట్ నిలిచింది.ఇది పారిస్ నగరంలో కలదు.ఇక్కడ భోజనం ఆరగించాలంటే దాదాపు $445 వెచ్చించాల్సి ఉంటుంది.
ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్ చల్ అవుతోంది.దీన్ని చదివిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.
అంత డబ్బు లేని వారు ఆ హోటల్ లో తినడానికి అర్హులు కారన్న మాట అంటూ దీనంగా కామెంట్లు పెడుతున్నారు.