మీరు భోజ‌న ప్రియులా.. ఈ 10 అడుగుల బాహుబ‌లి దోశ‌ను తినండి.. మ‌నీ గెల‌వండి

మన దేశంలో ప్రతీ వంద కిలోమీటర్లకు జనం భాష, వేషధారణ మారుతుంటుంది.ఈ క్రమంలోనే ఆహారపు అలవాట్లు కూడా చేంజ్ అవుతుంటాయి.

అయితే, దాదాపుగా అందరూ మార్నింగ్ టైమ్స్ లో తీసుకునే టిఫిన్స్ లో దోశ అయితే ఉంటుంది.ఇకపోతే ఏ ప్రాంతానికి తగ్గట్లు ఆ ప్రాంత స్పెషల్ దోశలు తయారు చేస్తుంటారు.

అందరూ దోశను మార్నింగ్ టైం టిఫిన్‌గా ఇష్టంగా తీసుకుంటారు కూడా.కాగా, మీకు దోశ బాగా ఇష్టం అయితే ఈ వెరైటీ దోశకు సంబంధించిన ఆఫర్ మీరు తెలుసుకోవాల్సిందే.

సోషల్ మీడియాలో ఈ దోశకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది.ఇందులో పది అడుగుల దోశ గురించి బంఫర్ ఆఫర్ ఇచ్చారు.

Advertisement

వివరాల్లోకెళితే.ఎవరైనా కానీ పది అడుగుల దోశను తిన్నట్లయితే వారు ఆ దోశకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు.దాంతో పాటు వారికి రూ.71 వేల ప్రైజ్ మనీ కూడా ఇస్తామని ఓ రెస్టారెంట్ ప్రకటించింది.ఆ రెస్టారెంట్ ఎక్కడుందంటే.

మన దేశ రాజధాని ఢిల్లీలోని బిందాపుర్‌లోని శక్తి సాగర్​ రెస్టారెంట్‌ ఈ ఆఫర్ ప్రకటించింది.పది అడుగుల పొడవుండే ఆ పొడవాటి దోశ తిన్నట్లయితే బంపర్ ఆఫర్ ఇస్తామని ప్రకటించింది రెస్టారెంట్ యాజమాన్యం.

రెస్టారెంట్ ఎవ్రీ వీకెండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ తయారు చేస్తుంటుంది.ఈ క్రమంలోనే పది అడుగుల పొడవుండే ఈ దోశను తయారు చేసింది.దీని ఖరీదు రూ.1,500గా ఫిక్స్ చేసింది.అయితే, ఈ దోశను తిన్నట్లయితే వారికి ప్రైజ్ మనీ ఇస్తామని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది.అలా మీరు ఈ దోశను తిన్నట్లయితే రూ.71,000 ఇస్తామని పేర్కొంది.ఇంకెందుకు ఆలస్యం మరి.మీరు భోజన ప్రియులు అయితే, చక్కగా వెళ్లి అక్కడ దోశ తినడానికి ట్రై చేసి .రూ.71 వేలు గెలుచుకునేందుకుగాను ప్రయత్నించండి.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు