పరారీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ సాయి శివాజీ దర్శకత్వంలో రూపొందిన సినిమా పరారీ.( Parari ) ఇందులో యోగేశ్వర్, అతిధి జంటగా నటించారు.

ఇక ఈ సినిమాను శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పించారు.ఇక ఈ సినిమాను నిర్మాత జి.వి.వి.గిరి నిర్మించాడు.ఇక ఈ సినిమా లవ్ అండ్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికొస్తే.ఇందులో యోగి, అతిధి ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటారు.

దాంతో వారిద్దరు మధ్య పరిచయం ఏర్పడటంతో ఇద్దరు ప్రేమలో పడతారు.ఇక యోగి తండ్రి షయాజీ షిండే.

Advertisement

అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్.ఎప్పుడు బిజీగానే ఉంటుంటాడు.

ఇక యోగి కి రఘు, భూపాల్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు.ఇక భూపాల్ తోటి ఆర్టిస్ట్ అయిన శివాని సైనిని ప్రేమిస్తాడు.

ఈ ఐదు మంది కలిసి అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు.ఇక దాని నుండి బయట పడటానికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇక ఆ సమయంలో యోగి తండ్రి పాండే చేత కిడ్నాప్ కి గురవుతాడు.అయితే ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఈ ఐదుగురి ఎలా బయటపడతారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

యోగి ( Yogeswaar ) తన తండ్రిని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగిలిన కథలోనిది.

Advertisement

నటినటుల నటన:

ఇక యోగేశ్వర్ హీరోగా కొత్తగా పరిచయం అయినప్పటికీ కూడా బాగానే నటించాడు.డ్యాన్సులు అద్భుతంగా చేశాడు.యాక్షన్స్ అన్నివేశాలలో కూడా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ అతిధి( Athidi ) నటన కూడా పరవాలేదు.భూపాల్ పాత్ర కూడా బాగానే ఆకట్టుకుంది.

శివాని సైని పాత్ర కూడా మంచి గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక జబర్దస్త్ రఘు తన కామెడీతో బాగా నవ్వించాడు.

ఆలీ పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంది.శియాజీ షిండే కూడా అద్భుతంగా నటించారు.

మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా డైరెక్టర్ సాయి శివాజీ మంచి కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.కామెడీ తో బాగా నవ్వించాడు.అంజి అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

మహిత్ నారాయణ అందించిన మ్యూజిక్ కూడా బాగా హైలైట్ గా ఉంది.ఇక మిగిలిన నిర్మాణం విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

ఈ సినిమాను లవ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పాలి.

ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిన ఈ సినిమా కథ ఆ తర్వాత ట్విస్ట్ లతో బాగా పరుగులు పెట్టించాడు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, కామెడీ, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం.

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు ఊహించినట్లుగా అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కూడా కథ, కామెడీ పరంగా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు