అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త టీడీపీ మాజీ మంత్రి కాళ్లపై పడ్డాడు.రామాంజనేయులు అనే వైసీపీ కార్యకర్త మాజీమంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడ్చాడు.
పార్టీ మారి తప్పు చేశానంటూ బోరున విలపించాడు.దీంతో కార్యకర్తను పైకి లేపి ఆప్యాయంగా పలకరించారు పరిటాల సునీత.
అనంతరం టీడీపీ కండువా కప్పి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో టీడీపీ కోసం కృషి చేస్తానని పరిటాల సునీతకు రామాంజనేయులు మాట ఇచ్చారు.
అయితే గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు.







