టీడీపీ అమరావతి పాదయాత్ర ... వైసీపీ ఉత్తరాంధ్ర పాదయాత్ర ?

అమరావతి పేరు చెప్తే టిడిపి అందరికీ గుర్తుకొస్తోంది.

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు,  ఇప్పటికే అక్కడ అనేక ప్రభుత్వ భవనాలను నిర్మించడం, పరిపాలన మొదలు పెట్టడం వంటివి జరిగాయి .

అయితే మొదటి నుంచి అమరావతి విషయంలో విమర్శలు చేస్తూనే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకోము అంటూ వైసిపి ప్రకటనలు చేస్తూనే వచ్చేది .దీనికి తగ్గట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి ప్రాధాన్యం తగ్గించారు.ఏపీలో మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఏపీలో మూడు రాజధానులు ఉండాలి అని వైసిపి ప్రకటించడంతో పాటు, దానిని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.     ఈ క్రమంలోనే ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలి అంటూ టిడిపీ మద్దతుతో రైతులు , మహిళలు అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర ను నిర్వహిస్తున్నారు.

ఈ పాదయాత్రపై జనాల్లో చర్చ జరుగుతూ ఉండడంతో,  వైసిపి అనూహ్యంగా ఉత్తరాంధ్ర పాదయాత్రను తెరమీదకు తీసుకు వచ్చింది.అయితే టిడిపి మాదిరిగానే వైసీపీ కూడా నేరుగా పాదయాత్ర చేపట్టకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ పాదయాత్రను జరిపించేందుకు సిద్ధమైంది.

Advertisement

  మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టబోయే పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని వైసీపి ప్రకటించింది.ఈ యాత్రను విజయవంతం చేసేందుకు ఉత్తరాంధ్ర వైసిపి ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి తో పాటు , ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట.   

అంటే అమరావతిలో ఆ ప్రాంత రైతులు మహిళలు చేపడుతున్న మహా పాదయాత్రకు,  ఆందోళన కార్యక్రమాలకు టిడిపి ఏవిధంగా అయితే పరోక్ష సహాయం అందిస్తుందో అదే మాదిరిగా ఉత్తరాంధ్ర పాదయాత్రకు వైసిపి పరోక్షంగా సహకారం అందించడంతో పాటు , ఆర్థికం గానూ సహాయం అందించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అంటే జనాల్లో అమరావతి పాదయాత్ర పైన మాత్రమే చర్చ జరగకుండా , ఉత్తరాంధ్ర పాదయాత్ర పైనా చర్చ జరిగేలా వైసీపీ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు