ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.
ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది.గత ఎన్నికల్లో ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.
ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని.పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపూ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.
అయితే వైసీపీకి గ్రామస్తాయి వరకు క్యాడర్ చాలా ఉంది.అయితే ఇదివరకటిలాగా ట్రెడిషనల్ పాలిటిక్స్ ఇప్పుడు వర్కౌట్ అవడంలేదు.
గత మూడు ఎన్నికల నుంచి సీన్ మొత్తం మారింది.సోషల్ మీడియాదే ఇపుడు పై చేయి.
దాంతో తన క్యాడర్ ని ఆ దిశగా కన్వర్ట్ చేసే అతి పెద్ద పనిలో వైసీపీ ఉందని అంటున్నారు.పార్టీకి ఉన్న కార్యకర్తలను సోషల్ మీడియా వైపుగా నడిపించడం ద్వారా మరోసారి అద్భుతమైన ఫలితాలను అందుకోవాలని చూస్తోందని అంటున్నారు.
ఇక వైసీపీకి 2019 ఎన్నికల్లో అసలైన ప్రచారం అంతా సోషల్ మీడియాలోనే జరిగింది.చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ వారి బుర్రలోకి వైసీపీని సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కించేశారు.
ఇపుడు కూడా అదే రకంగా పార్టీని జనాలలో ఉంచాలని తాము ప్రభుత్వంలో ఉంటూ చేసిన కార్యక్రమాలను కూడా జనంలో ఉంచాలని చూస్తోంది వైసీపీ.అందుకోసం సోషల్ మీడియా సైన్యాన్ని ఏపీ అంతటా భారీ ఎత్తున తయారు చేయడానికి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.
ప్రతీ జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు.అలాగే వారికి సహాయకులుగా నలుగురేసి వంతున జిల్లాలలో కో సమన్వయకర్తలను నియమించనున్నారు.ఈ మేరరకు పార్టీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది అని అంటున్నారు.
అంతే కాదు ప్రతీ నియోజకవర్గం నుంచి అలాగే ప్రతీ గ్రామం నుంచి కూడా సోషల్ మీడియాలో వైసీపీ ప్రాతినిథ్యం ఉండేలా చర్యలను తీసుకుంటున్నారు.
పార్టీ గురించి ప్రభుత్వం గురించి సానుకూలంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకుపోవడం ద్వారా వైసీపీకి మరోసారి విజయాన్ని దక్కించుకోవడానికి పార్టీ ఈ ప్లాన్ వేసింది అంటున్నారు.ఇక టీడీపీ కూడా ఈ విషయంలో తక్కువేమి కాదు.
ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.ఇక పవన్ కల్యాణ్ కు ఎలాగూ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దది.
సోషల్ మీడియాలో జనసేన పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు.ఇపుడు వైసీపీ కూడా అదే ఫాలో అవుతోంది.
అయితే గత ఎన్నికల్లో సోషల్ మీడియా పోషించిన పాత్ర ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదన్నిది.ప్రశ్న.

అప్పుడంటే టీడీపీ మీద వ్యతిరేకత.ఒక్క చాన్స్ జగన్ వేవ్ కలిపి సోషల్ మీడియా ఎంత దూకుడు చేసినా దానికి తగినంతనా ఫలితం దక్కింది.ఈసారి అధికారంలో ఉన్న పార్టీ రంగంలోకి దిగుతోంది.సోషల్ మీడియాలో ఎంతలా చెలరేగినా దానికి తగిన కౌంటర్లూ పంచులు కూడా రెడీగా ఉంటాయి.మరి వీటని ఎలా ఎదుర్కుంటుందో.చూడాలి.