ఒకరు ఆ పార్టీలోకి మరొకరు ఈ పార్టీలోకి ! ఆ వైసిపి సీనియర్లు డిసైడ్ అయ్యారా ? 

వైసీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది.ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావడం,  వైసిపి ఘోరంగా ఓటమి చెంది 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో, వైసీపీని ( YCP ) వీడి టిడిపి, జనసేన లలో చేరే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఇప్పటికే చాలామంది వైసిపి కీలక నాయకులు పార్టీ మారిపోయారు .5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి రావడం, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తమపై కేసులు నమోదయ్యి విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయం,  కొంతమంది వ్యాపార వ్యవహారాలు ఇలా అన్నీ ఆలోచించి పార్టీ మారేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసిపి లో కీలక నేతలుగా ఉన్న మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ,జగన్ బంధువు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivas Reddy ) పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.వాస్తవంగా ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది.

  కానీ స్వయంగా జగన్( Jagan ) రంగంలోకి దిగి బాలినేని ని బుజ్జగించారు.అయితే మొన్నటి ఎన్నికల్లో బాలినేని ఓటమి చెందడం, వైసీపీలోని కీలక నాయకులు కొందరితో పోసాగకపోవడంతో పాటు, జగన్ వైఖరి పైన కాస్త అసంతృప్తిగా ఉంటున్న బాలునేని జనసేనలో( Janasena ) చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

అలాగే చీరాల మాజీ ఎమ్మెల్యే సీనియర్ పొలిటిషన్ కరణం బలరాం( Karanam Balaram ) కూడా పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం  నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కరణం బలరాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు .ఆ తర్వాత వైసీపీలో చేరారు మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓటమి చెందారు.ఈ నేపథ్యంలోనే వైసీపీని వీడే ఆలోచనతో కరణం బలరాం ఉన్నారట.

బాలినేని,  కరణం బలరాం ఇద్దరూ ఏ పార్టీలో ఉన్నా.గత రెండున్నర దశాబ్దాలుగా మంచి స్నేహితులుగానే ఉండడంతో,  వైసీపీలో కొనసాగుతూ ఇబ్బందులు పడే కంటే పార్టీ మరితేనే మంచిదనే అభిప్రాయానికి ఇద్దరు నేతలు వచ్చారట.

ఈ నేపథ్యంలోని జనసేనలో చేరేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా , కరణం బలరాం మాత్రం టిడిపిలో చేరే ఆలోచనతో ఉన్నారట.

జగన్ చేస్తున్న డిమాండ్ అమలు సాధ్యమేనా ? 
Advertisement

తాజా వార్తలు