జలయజ్ఞంను వైసీపీ సర్కార్ ధనయజ్ఞంగా మార్చింది.. బుద్దా వెంకన్న

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు.

కొడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గంజాయి తాగి కొడాలి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టును 78 శాతం పూర్తి చేసిన చరిత్ర చంద్రబాబుదని బుద్దా వెంకన్న తెలిపారు.జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని అందరికీ తెలుసన్నారు.

పుంగనూరు ఘటనలో కావాలనే వైసీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు.చంద్రబాబును అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో దాడులు చేశారన్నారు.

కొడాలి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.చంద్రబాబు పర్యటనను మరోసారి అడ్డుకోవాలని చూస్తూ తాము కూడా గట్టిగానే దాడులు చేస్తామంటూ హెచ్చరించారు.

Advertisement
దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు