పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి సభ జరుగుతోంది.ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు జనసేన పొత్తు తరువాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం విశేషం.
ఈ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏ పునర్ కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని తెలిపారు.
ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్పష్టం చేశారు.తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో వైసీపీ పాలన అంతం కాబోతోందని తెలిపారు.