పంచాయ‌తీ పోరులో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేకు దిమ్మ‌తిరిగే షాక్ ?

పార్టీ ర‌హితంగా జ‌రుగుతున్న పంచాయ‌తీ పోరును వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.తాము ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల జోరుకు ప్ర‌జ‌ల నుంచి భారీ మద్ద‌తు ల‌భించ‌డంతోపాటు.

 Ycp Mp, Mla In Shock Over Panchayat War, Ap, Ap Political News, Latest News, Pan-TeluguStop.com

ఖ‌చ్చితంగా ఈ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకునేందుకు కూడా ప్లాన్ చేసుకుంది.ఈ నేప‌థ్యంలోనే కొన్నాళ్లు మంత్రుల‌కు, త‌ర్వాత ఎమ్మెల్యేల‌కు పంచాయ‌తీ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.

అయితే.ఇప్పుడు ఏకంగా ఎంపీల‌ను కూడా రంగంలోకి దింప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని ఎంపీలు అంద‌రూ కూడా వైసీపీ మ‌ద్ద‌తు దారుల త‌ర‌పున ప్ర‌చారం ప్రారంభించారు.నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపీస్థాయి నాయ‌కులు.పంచాయ‌తీ పోరులో ముందుకు వ‌చ్చిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు.కానీ.

ఇప్పుడు వైసీపీ దూకుడుగా ఉండ‌డం.ఎట్టి ప‌రిస్థితిలోనూ పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవం చేసుకోవ‌డం ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న నేప‌థ్యంలో ఎంపీలు కూడా రంగంలోకి దిగారు.

అయితే.ఎక్క‌డిక‌క్క‌డ వీరికి ఎదురీత క‌నిపిస్తోంది.

ఎంపీల‌ను స్థానికులే నిల‌దీస్తున్న ప‌రిస్థితి ఉండ‌డంతోపార్టీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది.

Telugu Anantapuram, Ap, Latest, Mlashock, Mlas, Mp Geetha, Mps, Panchayat, Panch

ఎక్క‌డ త‌ప్పు జ‌రిగింద‌నే ప్ర‌శ్న ఉద‌యించింది.తాజాగా.కాకినాడ రూరల్ మండలం తిమ్మాపూరంలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ.

ప్ర‌చారం చేశారు.అయితే.

గ్రామస్థులు వీరిని నిలదీశారు.మొదట మంత్రి కన్నబాబు వచ్చి ప్రచారం చేసి వెళ్లిన కాసేపటికే ఎంపీ గీత తిమ్మాపురం వెళ్లారు.

వైసీపీ మ‌ద్ద‌తు దారుడు సత్యనారాయణను గెలిపించాలంటూ వంగా గీత ప్రచారం చేస్తుండగా గ్రామస్థులంతా ఎదురు తిరిగారు.

సర్పంచ్ అభ్యర్థి కోసం ప్రచారానికి ఒక మంత్రి, ఒక ఎంపీ రావాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.

దీంతో గ్రామస్థులకు సమాధానం చెప్పలేక ఎంపీ గీత అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ ప‌రిస్థితి ఇటీవ‌ల అనంత‌పురంలోనూ క‌నిపించింది.దీంతో వైసీపీ వేసుకున్న ప్లాన్ వ‌ర్కవుట్ అవుతుందా? అనే ప్ర‌శ్న‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube