టీడీపీపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీడీపీకి ఇది మహానాడు కాదన్న ఆయన రాజకీయంగా చివరి నాడని తెలిపారు.
చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో కానీ రాజకీయాలు చేసేది ఏపీలోనా అని ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు.ఎన్టీఆర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వాస్తవం కదా అని నిలదీశారు.
ఎన్టీఆర్ పార్టీని, బ్యాంక్ అకౌంట్స్ ను లాక్కున్నారని విమర్శించారు.మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పాలన్నారు.
నారా లోకేశ్ కు పట్టం కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.చంద్రబాబు, లోకేశ్ వల్ల కేంద్రం వద్ద ఏపీ ప్రతిష్ట దిగజారిందని మండిపడ్డారు.