ఏపీ అధికార పార్టీ ప్రజల్లో ఎంతగా తమ పరపతి పెంచుకుని రాబోయే ఎన్నికల్లో తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.ఆ పార్టీ నాయకులు వ్యవహార శైలి కారణంగా వైసిపి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశం వైసిపి నేతలను చుట్టుముడుతోంది.జగన్ చాలా జాగ్రత్తగా జనాల్లో పరపతి పెంచుకునేందుకు తమ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.
కొంతమంది నాయకులు మాత్రం జగన్ ప్రయత్నాలను వృధాగా మార్చేస్తున్నారు.ఈ క్రమంలోనే హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న గోరంట్ల మాధవ్ ను 2019 ఎన్నికల సమయంలో జగన్ వైసీపీలో చేర్చుకుని హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు.అయితే అప్పటి నుంచి మాధవ్ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే వస్తున్న ఇటీవల ఆయన నగ్నంగా ఓ మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఆయన వ్యవహారంతో వైసిపి ప్రజల్లోనూ అభాసుపాలు కావాల్సి వచ్చింది.ఇక అప్పటి నుంచి మాధవ్ సైలెంట్ గానే ఉంటున్నారు .ఏ అంశాల పైన ఆయన స్పందించడం లేదు.అయితే మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
అనంతపురం టౌన్ లోని రామ్ నగర్ లో గోరంట్ల మాధవ్ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.కానీ గత కొంతకాలంగా ఆయన ఎటువంటి అద్దె చెల్లించడం లేదని , ఆ ఇంటి యజమాని పోలీసులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
చాలాకాలంగా మాధవ్ తనకు అద్దె చెల్లించడం లేదని, అడిగితే బెదిరిస్తున్నాడని ఆ ఇంటి యజమాని మల్లికార్జున్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు.

తనుకు ఎంపీ గోరంట్ల మాధవ్ నుంచి రావాల్సిన అద్దె బకాయిలు ఇప్పించాలని , వెంటనే ఆయనతో ఇల్లు ఖాళీ చేయించాలని ఆయన పోలీసులను కోరారు.తనకు అద్దె , కరెంట్ బిల్లు రూపంలో మొత్తం 2 లక్షలు రావాలని, అడిగితే మాధవ్ అనుచరులు టిప్పర్లతో తొక్కించి చంపుతామంటూ తనను బెదిరిస్తున్నారని ఇంటి యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వ్యవహారం లో మాధవ్ స్పందన ఎలా ఉన్నా … వైసిపి కి మాత్రం ఈ తరహా వ్యవహారాలు పెద్ద తలనొప్పిగా మారాయి.ఇతర అంశాల్లో కూడా వైసిపి నాయకులు రాష్ట్రస్థాయి లో పార్టీ ప్రభుత్వ పరువును బజారును పడేస్తున్నారనే అసహనం ఆ పార్టీ అధినేత జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే బహిరంగంగా వారిపై ఏ చర్యలు తీసుకున్న, ప్రజల్లో చులకన అవుతామనే భావంతో జగన్ సైలెంట్ గానే ఉంటున్నారు .కానీ అంతర్గతంగా మాత్రం సదరు నాయకుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
.