సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే... అసలు మ్యాటర్ ఏంటంటే..?!

రాజకీయ నేతలు ప్రజల ముందుకొచ్చి ప్రసంగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.పొరపాటున నోరు జారితే అందరిలో అభాసుపాలు అయ్యే ప్రమాదం ఉంది.

ప్రజా పరిపాలకులు అయ్యుండి కూడా సరిగా మాటలు కూడా మాట్లాడకపోతే.తీవ్ర విమర్శల పాలు కావడం తథ్యం.

అయితే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కూడా తప్పుగా మాట్లాడి ప్రజలకి అడ్డంగా దొరికిపోయారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల హడావుడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాము ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పగా.వైసీపీ నేతలు ప్రచార కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు.

Advertisement

అయితే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అని గంటా పదంగా ప్రకటించినప్పటికీ.స్థానికంగా టీడీపీ నేతలు తాము గెలుస్తామన్న ధీమాతో ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఐతే ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తడబడ్డారు.వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి తరఫున ఉంగుటూరు లోని గోపీనాథపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీ ని గెలిపించడానికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

దీంతో అక్కడే ఉన్న వైసీపీ పార్టీ సానుభూతిపరులు అందరూ గొల్లున నవ్వారు.జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

"జెడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి మీ ముందుకు ఓట్లను అభ్యర్థించడానికి రావడం జరిగింది.తప్పకుండా మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తు పై వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం," అని నోరు జారారు.దీంతో పక్కనే ఉన్న ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు షాక్ అవుతూ.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మనది ఫ్యాన్ గుర్తు అని చెప్పారు.దీంతో తేరుకున్న సదరు ఎమ్మెల్యే సారీ అని చెబుతూ.

Advertisement

ఎన్నికల నుంచి పారిపోయిన పార్టీ గుర్తుకు వచ్చింది.అందుకే కావాలనే సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని జోక్ చేశామని చెబుతూ.

కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

ఆయన నోరు జారిన వీడియో ని టీడీపీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.ఉచిత ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు.

తాజా వార్తలు