ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు( Siddham Meeting ) ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి( MP Vijayasai Reddy ) అన్నారు.ఈ క్రమంలోనే వచ్చే నెల 10వ తేదీన మేదరమెట్లలో సిద్ధం సభ జరగనుందని తెలిపారు.
ఈ సభకు సుమారు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు దాదాపు 98 ఎకరాల ప్రాంగణంలో సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ సభా వేదికపై నుంచి ప్రభుత్వ పథకాలు, ప్రజాపాలనపై సీఎం జగన్( CM Jagan ) వివరిస్తారని చెప్పారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండొచ్చన్నారు.వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) అతి త్వరలోనే విడుదల చేస్తామన్న విజయసాయిరెడ్డి సిద్ధం సభలోపే అన్ని సీట్లను ప్రకటిస్తామని పేర్కొన్నారు.ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు తమవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.