అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో ముగిసిన వైసీపీ నేతలు భేటీ.మాజీమంత్రి పేర్ని నాని.
టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేసాం.మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు.
తెలంగాణ లో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటు కలిగి ఉండటాన్ని పరిశీలించాలని కోరాం.తెలంగాణ లో ఓటు ఉండగా ఏపీలో ఓటు నమోదు చేసుకుంటున్న విషయాన్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్ళాం.
టీడీపీకి చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తి దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు.
ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు.
కోనేరు సురేష్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాం.టీడీపీకి చెందిన మై పార్టీ డాష్ బోర్డులో ఓటర్ల వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుంది.టీడీపీ మేనిఫెస్టో ప్రచారం తో చంద్రబాబు సంతకం తో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం.2019 లో ఓటర్ జాబితాలో ఉన్న ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి.నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.