విజయవాడలో వైసీపీ, జనసేన( YCP, Janasena ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలక్షన్స్ కు సిద్ధమంటూ వైసీపీ పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అధికార పార్టీ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే జనసేన పార్టీ నేతలు కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తో పాటు వంగవీటి ఫొటోలను ఫ్లెక్సీల్లో పెట్టిన జనసేన నేతలు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ క్యాప్షన్ పెట్టారు.ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వ్యవహారం విజయవాడ( Vijayawada ) రాజకీయాల్లో సంచలనంగా మారింది.