రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ( YCP ) తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలోనే రాజ్యసభ అభ్యర్థుల రేసులో పార్టీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ( YV Subbareddy, Meda Raghunath Reddy )మరియు గొల్ల బాబురావు ఉన్నారని తెలుస్తోంది.
ఈ సారి అభ్యర్థులుగా రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ యోచనలో ఉన్నారని తెలుస్తోంది.అలాగే దీనిపై ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.అనంతరం ఎల్లుండి అసెంబ్లీలో రాజ్యసభలో ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారని సమాచారం.