ఏపీలో అధికార పార్టీ వైసీపీ. ప్రతిపక్ష పార్టీ టీడీపీని కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది.
నెలరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు వంటి కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది.అనంతరం పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు మినీ మహానాడులను నిర్వహించారు.
కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ వచ్చే నెలలో పార్టీ ప్లీనరీ సమావేశాన్ని మహానాడుకు ధీటుగా నిర్వహించాలని ఆదేశించింది.దానికంటే ముందే పలు చోట్ల నియోజకవర్గాల వారీగా ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేసే కార్యక్రమానికి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి రాజకీయాల్లో ప్లీనరీ అంటే ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు.కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాల వారీగా వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించడం చూసి జనాలు నవ్వుకుంటున్నారు.
టీడీపీ మినీ మహానాడుకు పోటీగానే ఇలా ప్లీనరీలను నిర్వహిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.పోనీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారా అంటే.అది కూడా లేదు.కేవలం చంద్రబాబును తిట్టడం.
జగన్‌ను పొగడటం అనే కాన్సెప్టుకే ఈ ప్లీనరీలు పరిమితం అవుతున్నాయి.
తాజాగా గుడివాడలో వైసీపీ నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి బూతుల మంత్రులుగా ముద్ర పడ్డ కొడాలి నాని, పేర్ని నాని హాజరై ఒకరిని ఒకరు పొగుడుకున్నారు.

ఇది చాలదు అన్నట్లు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.సోమవారం నాడు గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆసరా చేసుకుని వైసీపీ నేతలు వికృష్ట రాజకీయాలకు పాల్పడ్డారు.ఎన్టీఆర్ విగ్రహం ఉండే దిమ్మకు వైసీపీ రంగులు వేశారు.ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొడాలి నానిపై విమర్శలు వచ్చాయి.అయితే ఈ అంశాన్ని కొడాలి నాని సమర్ధించుకున్నారు.ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చని తన పార్టీ నేతలకు హితవు పలికారు.

కాగా గతంలో వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలకు ప్రజా స్పందన లభించకపోవడంతోనే ఇప్పుడు ఆ పార్టీ నేతలు ప్లీనరీలు నిర్వహిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.నిజానికి ఏదైనా చేయాలని అనుకుంటే.నిలకడైన రాజకీయం చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
టీడీపీ మినీ మహానాడులు నిర్వహించిందంటే.ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను వినియోగించుకుంటోంది.
కానీ అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే ధోరణిలో వెళ్లడమేంటని ఎద్దేవా చేస్తున్నారు.







