కరోనా తరువాత ఇంధన ధరల పెరుగుదల ఏవిధంగా వుందో అందరికీ తెలిసిందే.ఈ కారణంగా ప్రయాణ ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి.
అలాంటిది విమానాయానం అంటే ఇంకెంత భారంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం సామాన్యుడు మోయలేని భారంగా విమాన ప్రయాణాలు మారాయి.
అత్యవసర పరిస్థితిలో కూడా అందులో ప్రయాణం చేయలేకపోతున్నవారు ఎందరో వున్నారు.ఇలాంటి సమయంలో ప్రముఖ విమానయాన సంస్థ అయినటువంటి స్పైస్‌జెట్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది.
ఇందులో భాగంగా ఈ కంపెనీ యాడ్-ఆన్ సర్వీసెస్ పై 25% తగ్గింపును అందిస్తోంది.ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ తాజాగా ప్రకటించింది.
ఈ ఆఫర్ SpiceMAX, Seat, Priority Check In, Preferred Bag Out వంటి యాడ్-ఆన్ ఉత్పత్తులపై అందుబాటులో ఉంటుంది.అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు వున్నాయి.
కంపెనీ వెబ్‌సైట్ ద్వారా చేసే ఆన్‌లైన్ బుకింగ్‌లతో పాటు యాడ్-ఆన్ సేవలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.ఈ ఆఫర్ వన్ వే, రౌండ్ ట్రిప్ బుకింగ్ లపై అందుబాటులో ఉంది.

ఇక ఈ ఆఫర్‌ను మరే ఇతర స్కీమ్‌తో కలపడం సాధ్యం కాదని కంపెనీ స్పష్టం చేయడం గమనించదగ్గ విషయం.విమాన ప్రయాణికులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి.బుకింగ్ చేసేటప్పుడు ప్రోమో కోడ్ ADDON25ని ఉపయోగించుకోవాలని స్పైస్‌జెట్ తెలిపింది.దీని కింద బుకింగ్ సమయంలో మాత్రమే కొనుగోలు చేసే యాడ్-ఆన్ సేవలపై 25% తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఈ ఆఫర్‌ను పొందవచ్చు.ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా సవరించే, రద్దు చేసే లేదా ఉపసంహరించుకునే హక్కు తమకు ఉందని కంపెనీ పేర్కొంది.
కాబట్టి ప్రయాణికులను సత్వరమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది.







