చంద్రబాబు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్

పరిస్థితి ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించి విపక్షాలు సోదిలోకి రాకుండా చేసింది.ప్రజలు ఆ పార్టీకి అనుకూలంగా ఏకపక్ష తీర్పు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా వైఎస్సార్సీపీ పై ఎలాంటి వ్యతిరేక పవనాలు లేవనే సంకేతాలను ఈ పరిషత్ ఫలితాలు ఇచ్చాయి.

 Ycp Clean Sweep In Chandrababu District, Ap Poltics , Mptc , Zptc , Election Re-TeluguStop.com

కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి.శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది.

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు ఎర్రన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళం లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ హవ  నడిచింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోరు చాలాచోట్ల ఎకపక్షంగా మారిందని విషయాన్ని ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పష్టం చేసింది.తెలుగుదేశం పార్టీ బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.

కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి.జడ్పీటీసీల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించాయి.చిత్తూరు జిల్లాలో మొత్తం 33 జడ్పీ స్థానాలు ఉండగా మెజారిటీ చోట్ల వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు.

ప్రకాశం జిల్లాలో 16 స్థానాలకు 16 సీట్లు వైసీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు.ఆయా జిల్లాల్లో ఎక్కడ గానీ టీడీపీ, బిజేపీ, జనసేన పార్టీలు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం చాలా రోజులు వాటిని అలాగే ఉంచడంతో కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులోకి నీరు చేరగా మరికొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లు చెదలు ఉంటాయి.ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు వెలుగు చూడటంతో కొన్ని చోట్ల రీపోలింగ్ మరికొన్ని చోట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

గత ఏప్రిల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల కారణంగా.కోర్టు కేసుర కారణంగా లెక్కింపునకు జాప్యం జరుగుతూ ఆదివారం ఓట్లను లెక్కించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube