చంద్రగిరిలో రాజకీయ రౌడీయిజం! టీడీపీ-వైసీపీ బాహాబాహి కొట్లాట

ఏపీ రాజకీయాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు రాజకీయ ప్రత్యర్ధులుగా మారిపోయి రౌడీ రాజకీయాలు మొదలెట్టారు.

కార్యకర్తలని రెచ్చగొడుతూ అర్దరాత్రి రోడ్లు మీద గొడవలు పడుతున్నారు.

ఏపీలో ఎన్నికలు అంటేనే శాంతి భద్రతల సమస్యగా ఎన్నికల సంఘం భావిస్తుంది.అందుకు తగ్గట్లుగానే ముందుగానే బలగాలని భారీ స్థాయిలో మొహరిస్తారు.

Ycp And Tdp Cadre Fight Each Other In Chandragiri-చంద్రగిరి�

రాయలసీమ జిల్లాలలో అయితే కుటుంబ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ఎన్నికల సమయంలో ఒకరికి ఒకరు కత్తులతో దాడులు చేసుకునేంత వరకు వెళ్తూ ఉంటారు.తాజాగా అదే పరిస్థితి చంద్రగిరిలో మరో సారి కనిపించింది.

చంద్రగిరిలో పనపాకం హరిజనవాడలో వైసీపీ, టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదమే చోటుచేసుకుంది.ఈ గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారి ఒకరి మీద ఒకరు కర్రలతో దాడులు చేసుకునేంత వరకు వెళ్ళింది.

Advertisement

ఈ దాడులలో పది మంది టీడీపీ కార్యకర్తలకి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తుంది.దీంతో గాయపడిన వారిని సమీపంలో హాస్పిటల్ కి తరలించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల వారు ఫిర్యాదులు చేసుకున్నారు.రాష్ట్రం ఓ వైపు అభివృద్ధిలో ముందుకి వెళ్తూ ప్రజల ఆలోచన, జీవన విధానాలలో మార్పు వస్తూ ఉన్న, రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో ఒకరితో ఒకరు తలపడుతూ ఎన్నికల తర్వాత ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని తిరుగుతున్నారు.

అయితే క్రింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఇంకా అదే పాత పద్ధతిలో దాడులు చేసుకునే అనాగరిక స్థాయిలో ఉన్నారని ఇలాంటి సంఘటనలు చూసినపుడు అర్ధమవుతుంది.

దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..
Advertisement

తాజా వార్తలు