తన తోటి ఉద్యోగులు స్నేహితులైన వారి ముందు డ్యాన్స్ చేయలేదని భార్య తో అతి నీచంగా ప్రవర్తించాడు ఒక క్రూరమైన భర్త.ఈ సంఘటన పాకిస్తాన్ లోని లాహోర్ లో జరిగింది.
భర్త తో పాటు తన స్నేహితులు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తిచారట.ఇంతకి అసలు విషయం ఏమిటంటే…
లాహోర్ లో నివసిస్తున్న దంపతులు ఇద్దరు కొద్దీ కాలంగా బాగానే ఉన్నారు , భార్య భర్తల మధ్య పెద్దగా గోడవలేం లేవు , అయితే ఆమె భర్త కి తాగుడు అలవాటు ఉండడం వల్ల అప్పుడప్పుడు మితిమీరి ప్రవర్తించేవాడు.
ఈ సారి ఆఫీస్ లో తన తోటి ఉద్యోగులు స్నేహితులైన వారితో పార్టీ చేసుకున్న భర్త ఫుల్ గా తాగి స్నేహితులతో పాటు ఇంటికొచ్చాడు.అక్కడ కాసేపు మళ్ళీ తాగడం మొదలెట్టారు , అయితే వారు తాగుతున్నపుడు ఆమెని కూడా తాగమని బలవంతం చేసాడు.
అతని స్నేహితుల ముందు డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేసాడు.దానికి ఆమె ఒప్పుకోకపోవడం తో తన కాళ్ళు కట్టేసి చిత్రహింసలు పెట్టాడట.
ఈ విషయాన్ని జడ్జి ముందు చెప్పుకుంటూ ఆమె తీసిన వీడియో ని కోర్ట్ లో అందజేసింది.

తనను హింసించే సమయంలో తన భర్తతో పాటు మరికొందరు ఉద్యోగులు కూడా ఆ పక్కనే ఉన్నారని తెలిపింది.ఆ బాధలు భరించలేక నేను ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించా.దీంతో నా భర్త నన్ను కొట్టాడు , ఆ తర్వాత తన బట్టలు విప్పడానికి ప్రయత్నించి నా గుండు కొట్టాడు
నా ఫ్రెండ్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లింది.ఘటనపై మెడికల్ పరీక్ష నిర్వహించాలని కోరితే పోలీసులు రూ.5000 అడిగారని చెప్పింది.
ఇకపోతే తన భర్త తో ఉన్న స్నేహితులను విచారించగా వారికి మద్యం అలవాటు ఎక్కువ ఉండడం వల్ల ఆ మద్యం తాగిన మత్తులో ఏం చేస్తున్నామో అర్థం కాలేదు అని చెప్పుకొచ్చారు.అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన పోలీస్ లు పట్టించుకోలేదని అందుకే అక్కడ నుండి ఏడ్చుకుంటూ బయటకి వచ్చేసా అని తెలిపింది…
.