ఛీ.. ఛీ.. చివరికి.. యశశ్వికి కూడా కులం అంటగట్టేస్తున్నారుగా..!

రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం ప్రపంచం మొత్తం మరీ ఎక్కువగా అయ్యింది.

దీంతో కొందరు సోషల్ మీడియా పుణ్యమా అంటూ రాత్రికిరాత్రి సూపర్ స్టార్లు అయిపోతున్నారు.

అయితే ఇలా ఫేమస్ అయిన వారిలో చాలా మంది వారి టాలెంట్ నిరూపించుకొని ఫేమస్ అయిన వారు ఎందరో.ఇలాంటి వారిలో తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలుగులో బాగా ఫేమస్ అయిన వ్యక్తి గాయకుడు కొండెపూడి యశస్వి.

జీ తెలుగు లో ప్రసారమయ్యే సరిగమప కార్యక్రమం మొదలు అవ్వకముందు యశస్వి ఎవరో కూడా తెలియదు.ఎప్పుడైతే యశస్వి పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట ప్రోమో లో రాగ రాత్రికి రాత్రి సింగింగ్ ఐకాన్ గా మారిపోయాడు.

దీంతో ఎక్కడ చూసినా యశస్వి పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట ఫుల్ ఫేమస్ అయిపోయింది.ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ఓ సంఘటన యశస్వి పేరు నాశనం చేసేలా కనబడుతోంది.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

యశస్వి కొండేపూడి కూడా మా కులం వాడు అని అతనికి కులం పేరును అంటగడుతున్నారు కొందరు తెలివి లేని మూర్ఖులు.నిజానికి కులం అనేది కళకి అడ్డంకి కాదన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిన వాస్తవం.అయితే ఎవరి సపోర్టు లేకుండా ఎదిగిన తర్వాత అతడు మా కులం అంటూ అతనికి సంబంధించిన కులం వారు చెప్పుకోవడం చేస్తూ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఓ వర్గం ప్రజలు.

అయితే తాజాగా కొందరు యశస్విని కూడా తమ కులం అంటూ చెప్పుకోవడానికి తెగ సంబరపడిపోతున్నారు.కొన్ని రోజుల క్రితం చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ అసోసియేషన్ వారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఎర్రకోట పక్కనే యశస్విని కొండేపూడి ఉన్న చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇందులో యశస్వి పేరును ప్రస్తావిస్తూ తమ కులం ముద్దుబిడ్డ కు శుభాకాంక్షలు అంటూ ఆయనని ఒకే కులానికి పరిమితం చేసేలా మాట్లాడారు.ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కళ ఉన్నవాడికి ఏది అడ్డు రాదు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఇప్పటికైనా ఇలాంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే వారి ఆలోచన మార్చుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు