జపనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు యమహా ‘ట్రైసిటీ’ అని పిలిచే దాని త్రీ వీలర్ స్కూటర్ సిరీస్‌ను అప్‌డేట్ చేసింది.ఇందులో ట్రైసిటీ 125, ట్రైసిటీ 155 ఉన్నాయి.
ఈ రెండు స్కూటర్లు సెంట్రల్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌సీడీ సెంటర్ కన్సోల్‌తో ఒకే విధమైన డిజైన్‌తో వస్తాయి.ఈ స్కూటర్లు ఒకే సీటును ఆఫర్ చేస్తాయి.
ట్రైసిటీ సిరీస్ స్కూటర్లు వెనుకవైపు ఒక చక్రం, ముందు రెండు చక్రాలతో వస్తుంది.తద్వారా వాటిని మూలలలో ఈజీగా తిప్పవచ్చు.

ట్రైసిటీ 125లోని 125cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 12.06bhp, 11.2Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ట్రైసిటీ 155లో 155cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది.ఇది 14.88 bhp శక్తిని, 14 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ రెండు స్కూటర్లు స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో వస్తాయి.ఈ టెక్నాలజీ ఫ్యూయల్ సేవ్ చేసి పర్యావరణానికి మంచి చేస్తుంది.యమహా ట్రైసిటీ మోడల్‌లలో ముందు, వెనుక అల్లాయ్ వీల్స్ వరుసగా 14 అంగుళాలు, 13 అంగుళాల సైజు ఉంటాయి.

ఈ స్కూటర్ రెండు వీల్స్‌కి డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు.దీనిలో ముందు వైపున టెలిస్కోపింగ్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జర్వర్‌లు ఇచ్చారు.ఈ స్కూటర్‌లో కీలెస్ ఎంట్రీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు ఉన్నాయి.జపాన్‌లో ట్రైసిటీ 125 ధర 4,95,000 యెన్లు (సుమారు రూ.3.10 లక్షలు), ట్రైసిటీ 155 ధర 5,56,500 యెన్లు (సుమారు రూ.3.54 లక్షలు)గా ఉంది.ఈ స్కూటర్లు జపనీస్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అయితే, తక్కువ డిమాండ్ ఉన్నందున యమహా ఈ స్కూటర్‌లను భారతదేశంలో విక్రయించే ఆలోచనలో లేదు.