సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక సినిమాని అన్ని భాషల్లోకి విడుదల చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఇతర భాషలలో రిలీజ్ చేసి హిట్స్ సాదిస్తున్నారు.
అలా మెల్లగా ఒక్కో భాషలో తమ ఫ్యాన్ బేస్ డెవలప్ చేసుకుంటున్నారు.ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ఆ కోవకే చెందుతాడని చెప్పుకోవాలి.
కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ బాలీవుడ్లలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది.

కాగా ఇప్పటికే కోలీవుడ్ నుండి విక్రమ్, విజయ్, సూర్య, కార్తీ, అజిత్ లాంటి హీరోలు వారి సినిమాలను తెలుగులో చేసి భారీగా క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ధనుష్ కూడా ఇదివరకు డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ మొదటిసారిగా సార్ సినిమాతో తెలుగులో డెబ్యూ చేశాడు.ఒక రకంగా ఇది స్ట్రయిట్ తెలుగు సినిమా అని చెప్పావచ్చు.తమిళంలో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొనడంతో సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో సునామీని సృష్టిస్తుంది అని చెప్పవచ్చు.సార్ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడని అంటున్నారు ప్రేక్షకులు.తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మించిన విషయం తెలిసిందే.
అయితే సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యూ లభించిందని సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ లెక్కన ధనుష్ కి ఉన్న ఇమేజ్ కి సార్ సినిమా ఇంకా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
ఫోను ఫోను కూడా ధనుష్ ఈ విధంగానే సినిమాలు సెట్ చేసుకుంటే తెలుగులో ఎటువంటి ఢోకా ఉండదని చెప్పవచ్చు.