వామ్మో, ఈ పాత జీన్స్ ప్యాంట్‌ ధర రూ.62 లక్షలు.. ఎందుకంటే?

సాధారణంగా జీన్స్ ప్యాంట్స్ మహా అంటే అయిదారు వేల రూపాయలు అవుతుంటాయి.హీరోయిన్లు, హీరోలు, ధనవంతులు కొనుగోలు చేసేవి రెండు లక్షల వరకు ఉంటాయి.అయితే తాజాగా ఒక పాతకాలంనాటి జీన్స్ ప్యాంట్‌ ఏకంగా రూ.62 లక్షలకు అమ్ముడుపోయింది.న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ 76,000 డాలర్ల (దాదాపు రూ.62 లక్షలు)కు ఒక వ్యాపారి కొనుగోలు చేశాడు.అయితే ఈ కొనుగోలుదారుడు కొనుగోలుదారుల ప్రీమియంతో 87,400 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

 Wow, This Old Pair Of Jeans Cost Rs. 62 Lakhs, Because Levi's Jeans, Auction, Ex-TeluguStop.com

శాన్ డియాగోకు చెందిన పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ అక్టోబరు 1న జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు.

అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు.గెలుపొందిన బిడ్‌లో 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు.ఈ జీన్స్ మరింత ఎక్కువ రేటుకి అమ్మాలని వారు భావిస్తున్నారు.హౌపెర్ట్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ ఖరీదైన జీన్స్ ఫొటోలను షేర్ చేశాడు.

ఈ పురాతన లెవీ పెయిర్ కొన్నేళ్లుగా ఒక పాత గనిలో ఉందని లాంగ్ జాన్ అనే డెనిమ్ మ్యాగజైన్ నివేదించింది.ఈ నివేదిక ప్రకారం, దీనిని ఒక మైనర్ ఉపయోగించారు.ఈ ప్యాంటు నడుము బ్యాండ్‌లపై సస్పెండర్ బటన్‌లు, సింగిల్ బ్యాక్ పాకెట్‌ను కలిగి ఉంది.వేలం లిస్ట్‌ ప్రకారం, ఈ పాతకాలపు జీన్స్ గోల్డ్ రష్ యుగంలో తయారుచేసిన ఒక పురాతన లెవీస్‌ బ్రాండ్ కి చెందినది.

ఈ ప్యాంటు మంచి ధరించదగిన స్థితిలో ఉందని కొనుగోలుదారుడు చెప్పాడు.ఈ ప్యాంటు ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఇంత మొత్తం డబ్బులు పెడితే మంచి ఇల్లు కొనుక్కోవచ్చు లేదా లగ్జరీ కారు కొనచ్చు.ఈ పాత ప్యాంటు ఎవరు కొంటారు అని కామెంట్ చేస్తున్నారు.

ఖరీదైన ప్యాంటుపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube