మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో మాంసాహారాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు ఉన్నారు.మాంసం లేనిదే కొంతమందికి ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు.
అంతలా మాంసాహారానికి చాలామంది ప్రజలు అలవాటు పడిపోయారు.ప్రతిరోజు ఆహారంలో మాంసాహారం తినేవారికి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కానీ ఓ కొత్త అధ్యయనం మాత్రం మాంసాహరులకు షాకిచ్చింది.వారు మాంసానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది.జర్మనీ ఆహార అధ్యయనం ప్రకారం ప్లేటులో మాంసాహారానికి బదులు తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లకు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం కూడా ఎంతో మంచిది.మాంసాహారాన్ని దూరం పెట్టడం వల్ల పేగులు, జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.ఊబకాయం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు నాలుగింట ఒక వంతు ఆహారమే ప్రారంభమవుతుంది.జంతువులు తాము తిన్న ఆహారంలో కొద్ది భాగాన్ని మాత్రమే మాంసంగా మార్చుకుంటాయి.ఇవి మీథేన్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి.
దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ సమస్య ఇంకా పెరుగుతుంది.మంచి ఆహారం అంటే కేవలం తిన్న మనుషుల కు మాత్రమే మంచి చేసేది కాదు, పర్యావరణానికి మేలు చేసేది అయ్యుండాలి.
మాంసాహారాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.ఈ అధ్యయనాన్ని జర్మనీలోని బోన్ యూనివర్సిటీ పరిశోధకులు జులియానా పారిస్ తన సహచరుల తో కలిసి తెలుసుకున్నారు.
అందువల్ల ఆహారంలో ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకోవడం మన ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.