భారత దేశంలో అత్యధిక డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఈ-కామర్స్ సంస్థలు అనగానే మనకు వెంటనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గుర్తుకొస్తాయి.నిజానికి అధిక డిస్కౌంట్లను పొందడానికి చాలా మంది ఈ రెండు వెబ్‌సైట్లలోనే ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతుంటారు.
అయితే వీటన్నింటి కంటే ఇంకా ఎక్కువగా డిస్కౌంట్లు అందించే మరో ఈ-కామర్స్ సంస్థ కూడా ఉంది.అది ప్రభుత్వానికి చెందిన సంస్థ కావడం మరో విశేషం.
ఎకనమిక్ సర్వే (ఆర్థిక సర్వే) ప్రకారం, గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (gem.gov.in) భారతదేశంలో అన్ని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల కంటే ఎక్కువగా రాయితీలను అందిస్తోంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల కంటే ఇది తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తోంది.తాజాగా ఎకనామిక్ సర్వే గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ సైట్‌లో మొత్తం 22 వస్తువుల ధరలను చెక్ చేసింది.
అయితే వీటిలో 10 వస్తువుల ధరలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కంటే చాలా తక్కువగా ఉన్నాయి.పార్కర్ జోటర్ స్టాండర్డ్ బాల్ పెన్ ధర రూ.200కే లభిస్తుండగా ఇతర వెబ్‌సైట్లలో ఇది రూ.207 అమ్ముడు పోతుంది.మిగతా వస్తువుల ధరల్లో మాత్రం భారీ తేడా కనిపిస్తోంది.జీఈఎం వెబ్‌సైట్‌లో 1500 ఎంఎల్ మిల్టన్ థర్మోస్ ధర రూ.1101 ఉంటే, ఇతర వెబ్‌సైట్లలో ఇది రూ.1499కి సేల్ అవుతుంది.అంటే మీరు ఏకంగా రూ.400 ఎక్కువ డిస్కౌంట్ తో మిల్టన్ థర్మోస్ ని సొంతం చేసుకోవచ్చు.ఇంకా చెప్పుకుంటూ పోతే… గోద్రేజ్ ఇంటీరియో ఎలైట్ మిడ్ బ్లాక్ కుర్చీ, గోద్రేజ్ ఇంటీరియో స్టీల్ అల్మిరా 2400ఎంఎం, శాంసంగ్ బేసిక్ టీవీ 43 ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువకే గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో దొరుకుతున్నాయి.

ఎకనమిక్ సర్వే ప్రకారం గవర్నమెంట్ సైట్‌లో వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా సగటున 15 నుంచి 20% ఆదా చేసుకోవచ్చు.అంతేకాదు ఈ-మార్కెట్‌ప్లేస్‌లో ఇతర సైట్లలో కన్నా కొన్ని వస్తువులపై గరిష్టంగా 56% డిస్కౌంట్ అందిపుచ్చుకోవచ్చు.నిజానకి ఇది కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్‌సైట్ ఏం కాదు.
కేంద్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలోనే ఈ-మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది.అధిక డిస్కౌంట్లు పొందాలనుకునేవారు ఇతర వెబ్‌సైట్‌లలోని ధరలను పోల్చి చూస్తూ ఇందులో షాపింగ్ చేయొచ్చు.