వావ్, తెల్ల రక్తకణాలు బ్యాక్టీరియాను ఎలా చంపేస్తాయో చూడండి..

మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు మన రోగనిరోధక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.వివిధ రకాలైన తెల్ల రక్త కణాలు శరీరంలో వివిధ విధులను నిర్వహిస్తాయి.

 Wow, See How White Blood Cells Kill Bacteria ,white Blood Cells, Bacterium, Vira-TeluguStop.com

ఏ విధంగా చూసుకున్నా ఈ తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవుల నుంచి మన శరీర భాగాలను రక్షిస్తాయి.అయితే అధిక తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణంగా సంక్రమణ లేదా అనారోగ్యానికి కారణమవ్వచ్చు.

తెల్లరక్తకణాలు శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

అయితే తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా, వైరస్‌లను ఎలా చంపేస్తాయో చాలామంది చూసి ఉండకపోవచ్చు.

కాగా అవి ఎలా బ్యాక్టీరియా వంటి వాటిని వేటాడి చంపేస్తాయో చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక బాక్టీరియంను వెంబడించే మానవ తెల్ల రక్త కణం ఈ వీడియోలో కనిపించింది.

ఈ అద్భుతమైన దృశ్యాన్ని మైక్రోస్కోప్ ద్వారా కొందరు రికార్డ్ చేశారు.

ఈ వీడియోను ట్విట్టర్ పేజీ @wonderofscience షేర్ చేసింది.కాగా దీనికి ఇప్పటికే 97 లక్షల వ్యూస్ వచ్చాయి.సాధారణంగా ఎముక మజ్జలో తెల్ల రక్త కణాలు తయారవుతాయి.

అవి మీ రక్తం, శోషరస కణజాలాలలో స్టోర్ అవుతుంటాయి.అయితే వైరల్ అవుతున్న వీడియోలో రక్తం లోకి ప్రవేశించిన ఒక బాక్టీరియంను ఫాలో అవుతూ దానిని తనలో కలుపుకోవడం కనిపించింది.

నిజానికి ఈ తెల్ల రక్త కణాలు కి ఎలాంటి కళ్లు కూడా లేవు.అలాంటిది అదెలా ఒక బ్యాక్టీరియంను కరెక్ట్‌గా ఫాలో అవుతూ దాన్ని పట్టేసింది? అని చాలామందికి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ అద్భుతమైన వీడియోను మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube