ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.చిన్నచిన్న కారణాలవల్ల వారిని రకరకాలుగా హింసిస్తున్నారు.
అలాంటి ఘటనే ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ లో జరిగింది.దొంగ అని ఒక దళిత యువకుడుని స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టి, అతడి మొఖానికి నలుపు రంగు పూసి, గుండు గీసి ఊరే ఊరంతా ఊరేగించారు.
ఇలాంటి చిత్రహింసలకు గురైన ఆ దళిత యువకుడి మీద వచ్చిన దొంగతనం నేరం ఏమిటంటే బాత్రూం లో ఉండే సీటు దొంగతనం చేశాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లా హర్దిలో మంగళవారం జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చి, ప్రస్తుత ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక నాయకుడు రాధేశ్యామ్ మిశ్రా, అతడి ఇద్దరు సహాయకులు రాజేశ్ కుమార్(30) అనే వ్యక్తిని రోడ్డుపై ఉన్న ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు.బాధితుడి ముఖం, తల మొత్తం నలుపు రంగులో నిండిపోయి ఏమాత్రం గుర్తు పట్టనంతగా మారిపోయేలా చేశారు.
ఇంత చిత్ర హింసలు చేసినందుకు ఆ యువకుడు నొప్పిని కూడా గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయాడు.
తమ ఇంట్లో బాత్రూంలో సీటు ఎత్తుకెళ్లిన కారణంతో రాజేష్ ను ఇలా కొట్టి హింసించినట్లు అక్కడివారు చెబుతున్నారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి రాజేష్ కి గుండు కొట్టించి ఊరు వీధుల్లో ఊరేగించారు.రాజేష్ రోజువారి కూలి పని చేసుకుంటూ జీవించేవాడు.అతడిని కొడుతున్నప్పుడు చుట్టూ ఉన్న జనం కూడా చప్పట్లు కొడుతూ ఏవో నినాదాలు చేశారు.ఆ దళిత యువకుడి కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్యకరమైన వాక్యాలు చేశారు.అయితే ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసి ఈ విచారణ చేపట్టారు.అయితే రాధేశ్యామ్ మిశ్రా పరారీలో ఉన్నాడని, అతడి ఇద్దరు సహాయకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.







