వావ్.. వాటిని పెంచండి.. రూ. 1.5 లక్షలను మీ సొంతం చేసుకోండి..!

ఈ ప్రపంచంలో చాలా మంది జంతు ప్రేమికులున్నారు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.కొందరు.

 Wow Raise Them. Rs Own 1 5 Lakhs , Cockroach, Latest Viral, News Viral, Social-TeluguStop.com

అయితే కుక్కలను, పిల్లులను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి వాటిని ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా పెంచుకుంటూ ఉంటారు.మనుషులకు పెంపుడు జంతువులకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.

వీటితో పాటుగా ఆవులు, మేకలు, కుందేళ్లు, గుర్రాలు, ఏనుగులను కూడా పెంచుకుంటూ ఉంటారు.మరికొందరు అయితే క్రూర జంతువులను కూడా పెంచుకుంటూ ఉంటారు.

ఎక్కడి దాక బాగానే ఉంది.మరి ఇంట్లో ఎవరైనా బొద్దింకలను పెంచుకోవడం గురించి విన్నారా.

మనకు ఇంట్లో బొద్దింక కనిపిస్తే చాలు ఎంతగానో చిరాకు పడుతూ దానిని చంపే వరకు వదలము.ఎందుకంటే వాటి వలన వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి.

కావున బొద్దింకలను కనిపించిన వెంటనే చంపేస్తు ఉంటాము.మరి అలాంటిది ఇంట్లో వంద బొద్దింకలను పెంచుకోవడం అంటే మాటలా చెప్పండి.

అలా ఇంట్లో బొద్దింకలను పెంచితే లక్ష రూపాయిల వరకు డబ్బులు కూడా ఇస్తాను అంటున్నారు ఒక కంపనీ వాళ్ళు.

అసలు వివరాలల్లోకి వెళితే.

ఒక ప్రముఖ పత్రిక ఇచ్చిన నివేదిక ప్రకారం నార్త్ కరోలినాలోని ఒక పెస్ట్ కంట్రోల్ కంపెనీ ఒక కొత్త ఔషధాన్ని కనుకొనే పరిశోధన చేస్తుంది.ఈ పరిశోధనలో భాగంగా వాళ్లకు కొన్ని బొద్దింకలు కావాలట.

పురుగులను నిర్మూలించడంలో ఈ మందు ఎంత ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కంపెనీ ఈ మందును ఆ బొద్దింకలపై పరీక్షిస్తుంది అంట.ఇందుకోసం కంపెనీ బొద్దింకలను పెంచుకునే ఇళ్ల కోసం వెతుకుతోంది.అలా వారు సెలెక్ట్ చేసిన ఇంటిలో కంపెనీ కనీసం 100 బొద్దింకలను ఆ ఇంట్లో విడుదల చేస్తుంది.ఆ బొద్దింకల కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు.

ఇందుకు గాను కంపెనీ వారు ఆ ఇంటి యజమానులకు లక్షా యాభై వేల రూపాయలను ఇస్తారట.నెల రోజుల పాటు ఈ పరిశోధన జరుగుతుంది.నెల రోజుల తర్వాత ఇంట్లో బొద్దింకలు లేకపోతే పరిశోధన ఫలించినట్లే.అలా కాకుండా బొద్దింకలు చనిపోకుండా ఉంటే కంపెనీయే ట్రీట్మెంట్ ద్వారా మిగిలిపోయిన బొద్దింకలు తొలగిస్తుంది అంట.అయితే కంపనీ ఒక షరతు కూడా పెట్టిందండోయ్.అదేంటంటే బొద్దింకలను పెంచే ఇళ్లన్నీ అమెరికాలోనే ఉండాలట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube