వచ్చే నెల 5 ,6 తేదీల్లో మళ్ళీ హౌస్ కమిటీ సమావేశం.మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ.
భూమన కరుణాకర్ రెడ్డి,కమిటీ అధ్యక్షుడు గత ప్రభుత్వం డేటా చౌర్యం విషయంలో అనేక దొంగ పనులు చేసింది.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పదేపదే చెప్పాము.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా డేటా చౌర్యం జరిగిందని చెప్పారు.అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రైవేట్ ఏజెన్సీ నుంచి సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసింది.
వ్యక్తుల ప్రైవేట్ భద్రత… దాడి కి సంబంధించి హౌస్ కమిటీ ఏర్పాటు జరిగింది కేవలం పెగసస్ అంశమే కాకుండా గత ప్రభుత్వం హయం లో జరిగిన వ్యక్తిగత భద్రతకు సంబంధించి హౌస్ కమిటీ విచారణ చేస్తుంది.అప్రజాస్వామిక ధోరణి తో గత ప్రభుత్వం వ్యవహరించింది.
త్వరగా విచారణ పూర్తి చేసి దోషులను ప్రజల ముందు నిలబెడతాం.అప్పట్లో ఉన్న అధికారులను కూడా విచారణకు పిలుస్తాం.







