ఓం రౌత్ ఇంటికి క్యూ కట్టిన ఆదిపురుష్ టీమ్.. ఎందుకబ్బా?

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.

 Adipurush Team Was Spotted At Director Om Raut’s House For A Party, Prabhas, A-TeluguStop.com

ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.  ఈయన నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న రెండేళ్ల క్రితమే ఈ సినిమా ముంబై లో ప్రత్యేకమైన సెట్స్ లో తెరకెక్కించారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.

ఈ పాత్ర కోసం డార్లింగ్ చాలా కష్టపడ్డాడు.వి షేప్ బాడీ కోసం చాలా చెమటలు చిందించాడు అని ఆయన కష్టం అంతా తెరమీద కనిపిస్తుంది అని ఇప్పటికే డైరెక్టర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఇది 3డీ వెర్షన్ కావడంతో అభిమానవులంతా సంతోషంగా ఉన్నారు.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా జానకి పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.

లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.

Telugu Adipurush, Om Raut, Om Rauts, Prabhas-Movie

అయితే ఈ సినిమాలో పని చేసిన నటీనటులంతా కూడా ఈ రోజు తెల్లవారు జామున డైరెక్టర్ ఓమ్ రౌత్ ఇంటి దగ్గర కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే వీరంతా కూడా ఇంత ఉదయాన్నే ఆయన ఇంటికి రావడానికి గల కారణాలు ఏంటి అని అందరు ఆరా తీస్తున్నారు.మరి తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఓం రౌత్ పార్టీ ఇస్తుండడంతో టీమ్ అంతా హాజరయినట్టు టాక్.వీరి సమావేశానికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో ప్రభాస్ మరింత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.  మరి టీమ్ ప్రొమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube