ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వంశం కావడంతో ఆ దేశంలో నిత్యం రక్తం చిందుతోంది.కాబూల్ విమానాశ్రయంలో తరుచు కాల్పులు వినిపిస్తున్నాయి.
ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి వైద్య సామగ్రి సరఫరాకు ఆటంకం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.కాబూల్ఎయిర్ పోర్ట్ ఆంక్షల వల్ల 500 టన్నులకు పైగా వైద్య సామాగ్రి సరఫరా నిలిచినట్లు సోమవారం పేర్కొంది.
తాలిబాన్ రాజ్యంతో ఆఫ్గాన్ ల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారని, వారికి వైద్యం, ఆహారం అత్యవసరమైన తెలిపింది.జనాభాలో దాదాపు సగం అంటే 18.5 మిలియన్ల మంది వరకు మానవతా సాయం పై ఆధారపడుతున్నాట్లు వెల్లడించింది.ప్రపంచ దృష్టి ప్రజల్ని తరలింపు విమానాల పైనే ఉంది గాని అక్కడ మిగిలిన వారి గురించి పట్టించుకోవడం లేదని వారికి సాయం అవసరమని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి ఇనాస్ హమామ్ తెలిపారు.

కాబూల్ కు విమానాలను దుబాయ్, యూఏఈ లోని తమ గిడ్డంగుల మళ్లించి అక్కడి నుంచి అవసరమైన వస్తువులను తీసుకుని ఆ ప్రజలకు తరలించేందుకు వెళ్లాలని కోరినట్లు చెప్పారు.అవసరార్థులకు వైద్య సామాగ్రిని చేర్చేందుకు0 ” హ్యుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్” ఏర్పాటునకు డబ్ల్యుహెచ్వో కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.