ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్ జీపీటీ( ChatGPT ) గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది ….కృత్రిమ మేధతో తయారైన ఈ చాట్ బోట్ మానవ మేధామేదో అవసరాలను కూడా తీర్చే స్థాయికి బలపడటం వాటిని ఈ స్థాయిలో సిద్దం చేయడం మానవ మెదస్సు గొప్పతనం అయినప్పటికీ ఇది రాను రాను మానవ మేధస్సు తో పోటీపడి మానవాళికి ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి .
టెక్నాలజీలో మేధావులు అనే పేరు పడినవారు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence )కి సరైన నియంత్రణ లేకపోతే వీటితో వచ్చే ముప్పు గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వచ్చే కొన్ని సంవత్సరాలలో కోట్లాది ఉద్యోగాలు AI రాకతో ప్రమాదం లో పడతాయని వార్తలు రాగా .వీటి వాడకం వల్ల నేర సామ్రాజ్యం అదుపు చేయలేనతగా విస్తరిస్తుందన్న అంచనాలు కలవరానికి గురి చేస్తున్నాయి .ఇప్పుడు మనం ప్రస్తుతం ఫోన్ లో వాడుతున్న గూగుల్ ట్రాన్స్లేటర్ ., వాయిస్ అసిస్టెంట్ ,, ఐఫోన్ లో ఉండే సిరి ఇవన్నీ చాట్ బోట్స్ కి ఒక మినీ వెర్షన్స్ అయితే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మరింత సమర్థవంతంగా ప్రోగ్రాం చేస్తున్నారని ఆలోచన విధానంలో సృజనాత్మకతలోనూ కూడా కూడా మానవ మేధస్సును డామినేట్ చేసే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదుగుతుందని వార్తలు వస్తున్నాయి .

.వీటి ఫలితంగా భవిష్యత్తులో సైబర్ క్రైమ్ ( Cybercrime )లాంటివి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయని ….వీటి ఫలితాలు పట్ల పూర్తిగా అవగాహన లేని ప్రభుత్వాలు వీటిని నియంత్రణలో పూర్తిస్థాయిలో సఫలమయ్యే అవకాశం లేదని అందువల్ల కొంతమంది అవకాశవాదులు స్వార్ధపరులు టెక్నాలజీ నిపుణులు మరింత ఆర్థిక సామాజిక నష్టానికి గురి చేసే అంశం ఉందంటూ సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు

అయితే కేవలం మానవ సౌలభ్యం కోసం డెవలప్ చేస్తున్నారు తప్ప మానవ మునుగుడుకు ముప్పువాటిల్లే స్థాయిలో వాటి సామర్థ్యం పనితీరు ఉండదని కొంతమంది ధైర్యం చెబుతున్నారు అయినప్పటికీ చెస్ లాంటి మానవ మెదస్సు ముడిపడిన ఆటలలో ఇప్పటికే మనిషి డామినేట్ చేస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలు రానున్న కాలంలో వీటిపై నియంత్రణ కోల్పోతే పరిస్థితి ఏమిటి అన్నది ఊహకు అందని విషయం లా మారింది .







